Janga Reddy Gudem : స్పీకర్‌‌పై పేపర్లు వేసిన టీడీపీ సభ్యులు.. ఖండించిన వైసీపీ

పేపర్లను చించేసి స్పీకర్ పై పడేయం ఒక్కసారిగా అసెంబ్లీలో కలకలం రేపింది. టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంత నచ్చచ

Janga Reddy Gudem : స్పీకర్‌‌పై పేపర్లు వేసిన టీడీపీ సభ్యులు.. ఖండించిన వైసీపీ

Ap Assembly Budjet

AP Assembly : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మిస్టరీ మరణాలు ఏపీ అసెంబ్లీలో కాక రేపాయి. వెంటనే ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ.. సభను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఏకంగా స్పీకర్ వెల్ లోకి దూసుకొచ్చారు. అనంతరం పేపర్లను చించేసి స్పీకర్ పై పడేయం ఒక్కసారిగా అసెంబ్లీలో కలకలం రేపింది. టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంత నచ్చచెప్పినా వినిపించుకోకపోవడంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Read More : AP Assembly : జంగారెడ్డి గూడెం మిస్టరీ మరణాలపై అసెంబ్లీలో రగడ, టీడీపీ సభ్యుల నినాదాలు

2022, మార్చి 14వ తేదీ సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం ప్రారంభించారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సీఎం రాజీనామా చేయాలంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. సభ్యులు చేస్తున్న వ్యవహరశైలిని అధికారపక్ష సభ్యులు తప్పుబట్టారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన ఘటనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. కానీ టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం కరెక్టు కాదన్నారు. ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు రెడీగా ఉన్నామని, అసలు విషయాలంటో ప్రజలకు తెలుస్తుందనే ఉద్దేశ్యంతో టీడీపీ సభ్యులు డ్రామాలకు తెరలేపిందని మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ సభ్యుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వైసీపీ సభ్యులు సూచించారు.

Read More : West Godavari : జంగారెడ్డిగూడెంకు బాబు..డెత్ మిస్టరీ పొలిటికల్ టర్న్, నాటు సారాయే కారణమా ?

పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో గత కొన్ని రోజులుగా పలువురు మరణిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత 10 రోజుల్లో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ 17 మంది మృతి చెందారు. నకిలీ సారాయి వల్లే వీరంతా చనిపోయారని టీడీపీ ఆరోపిస్తోంది. అంతేగాకుండా ఆందోళనలు కూడా చేపడుతోంది. ఈ క్రమంలో…2022, మార్చి 14వ తేదీ సోమవారం ఉదయం జంగారెడ్డిగూడెంకు వచ్చి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని.. మృతుల కుటుంబసభ్యులను టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు పరామర్శించనున్నారు. బాబు దగ్గరకు వెళ్లేందుకే అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటూ దుయ్యబట్టారు.