AP Assembly : జంగారెడ్డి గూడెం మిస్టరీ మరణాలపై అసెంబ్లీలో రగడ, టీడీపీ సభ్యుల నినాదాలు

. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న మరణాలపై అసెంబ్లీ రగడ కొనసాగుతోంది. మిస్టరీ మరణాలపై చర్చ జరగాల్సిందేనంటూ.. సోమవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలు చేయడంతో...

AP Assembly : జంగారెడ్డి గూడెం మిస్టరీ మరణాలపై అసెంబ్లీలో రగడ, టీడీపీ సభ్యుల నినాదాలు

Ap Assembly

TDP Members Raised Slogans : ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత సమావేశాల్లోగానే ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనూ సేమ్ సీన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రతిపక్ష సభ్యులు సరైన రీతిలో ముందుకు రావడం లేదని, కేవలం సభలో గందరగోళ పరిస్థితులను సృష్టించేందుకే టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారని అధికారపక్ష సభ్యులు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న మరణాలపై అసెంబ్లీ రగడ కొనసాగుతోంది. మిస్టరీ మరణాలపై చర్చ జరగాల్సిందేనంటూ.. సోమవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని అధికార పక్ష సభ్యులు స్పీకర్ ను కోరారు. మద్యపాన నిషేధంపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదని, బెల్టు షాపులు, పర్మిట్ రూంలు పెట్టి మద్యపానాన్ని ప్రోత్సాహించారని విమర్శలు చేశారు. ప్రతి మద్యం ఆదాయంపై బాబు సమీక్ష చేసే వారని విమర్శించారు. చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Read More : West Godavari : జంగారెడ్డిగూడెంకు బాబు..డెత్ మిస్టరీ పొలిటికల్ టర్న్, నాటు సారాయే కారణమా ?

సహజ మరణాలు సంభవిస్తే.. ప్రభుత్వం కారణమంటూ ఆరోపణలు గుప్పించడం సమంజసం కాదన్నారు. మరోవైపు..సీఎం జగన్ తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణ స్వామి భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎంకు వివరించారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని సీఎం జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలని సీఎం సూచించారు. ఈ అంశంపై సభలో వివరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More : Jangareddy Goodem : జంగారెడ్డిగూడెంలో మిస్టరీగా మరణాలు.. ఇప్పటి వరకు 16 మంది మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో గత కొన్ని రోజులుగా పలువురు మరణిస్తున్న సంగతి తెలిసిందే. గత 10 రోజుల్లో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ 17 మంది మృతి చెందడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు జంగారెడ్డిగూడెంపై ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా 2022, మార్చి 14వ తేదీ సోమవారం ఉదయం జంగారెడ్డిగూడెంకు వచ్చి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని.. మృతుల కుటుంబసభ్యులను టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు పరామర్శించనున్నారు.