West Godavari : జంగారెడ్డిగూడెంకు బాబు..డెత్ మిస్టరీ పొలిటికల్ టర్న్, నాటు సారాయే కారణమా ?

ఇంటింటి తనిఖీలు చేపట్టి.. ఎక్కడా నాటు సారా దొరకలేదని ప్రకటించారు. అధికారులు చెప్తున్న దానికి, మృతుల కుటుంబసభ్యులు చెప్తున్న దానికి పొంతన లేకపోవడం, తమకు న్యాయం జరగలేదని మృతుల...

West Godavari : జంగారెడ్డిగూడెంకు బాబు..డెత్ మిస్టరీ పొలిటికల్ టర్న్, నాటు సారాయే కారణమా ?

Babu

Chandrababu Visit Jangareddy Gudem : పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రానున్నారు. గత కొన్ని రోజులుగా పలువురు మరణిస్తున్న సంగతి తెలిసిందే. గత 10 రోజుల్లో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ 17 మంది మృతి చెందడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు జంగారెడ్డిగూడెంపై ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా 2022, మార్చి 14వ తేదీ సోమవారం ఉదయం జంగారెడ్డిగూడెంకు వచ్చి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని.. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నాయకులు వారం రోజులుగా జంగారెడ్డిగూడెం మృతుల మిస్టరీపై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మిస్టరీ మరణాలు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు కారణాలు కనుక్కోలేకపోయిందని రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మృతుల మిస్టరీకి కారణం నాటుసారానే అని టీడీపీ అంటుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా తోడై పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.

Read More : Jangareddy Goodem : జంగారెడ్డిగూడెంలో మిస్టరీగా మరణాలు.. ఇప్పటి వరకు 16 మంది మృతి

వారం రోజుల్లో.. 17 మంది చనిపోయారు. వరుస మరణాలు.. ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్నాయి. మున్ముందు.. ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. రోజుకు ఇద్దరు చనిపోతుండటంతో.. స్థానికుల్లో భయాందోళన మొదలైంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరడం, చికిత్స కొనసాగుతుండగానే మరణించడం.. ఇప్పుడు మిస్టరీగా మారింది. మొదటి నాలుగు రోజుల్లో 11 మంది చనిపోవడంతో బంధువులు వారందరినీ ఖననం చేశారు. తర్వాత చనిపోయిన వాళ్లకు పోస్టుమార్టం చేసినా వాళ్లలో ఎలాంటి నాటు సారా కారకాలు కనిపించలేదని డాక్టర్లు రిపోర్టులు ఇచ్చారు. కానీ బంధువులు మాత్రం తమ వాళ్లు నాటు సారా తాగటం వల్లే చనిపోయారని ఆరోపిస్తున్నారు. మృతి చెందిన వాళ్ల సంఖ్య 11 నుంచి 17కు చేరుకోవడంతో జిల్లా అధికారులు అలెర్టయ్యారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తదితర విభాగాలు వరుస మరణాలకు కారణాలపై ఆరా తీస్తున్నాయి.

Read More : Nara Lokesh Alcohol Deaths : సారా మ‌ర‌ణాల‌న్నీ జ‌గ‌న్ స‌ర్కార్ హ‌త్య‌లే-నారా లోకేష్

ఇంటింటి తనిఖీలు చేపట్టి.. ఎక్కడా నాటు సారా దొరకలేదని ప్రకటించారు. అధికారులు చెప్తున్న దానికి, మృతుల కుటుంబసభ్యులు చెప్తున్న దానికి పొంతన లేకపోవడం, తమకు న్యాయం జరగలేదని మృతుల బంధువులు ఆందోళన చేస్తుండటంతో పొలిటికల్ లీడర్స్‌ ఎంటరవుతున్నారు. దీంతో జంగారెడ్డిగూడెం మరణాల మిస్టరీకి ఇప్పుడు రాజకీయరంగు పులుముకుంది. జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై టీడీపీ ఆందోళనలు చేస్తుంటే ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. టీడీపీ ఆందోళన చేయడం.. టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్వయానా జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని నాని మరణాలకు కారణాలు తెలుసుకోవాలని ఆర్డర్ కూడా వేశారు. మంత్రి ఆళ్ల నాని జంగారెడ్డిగూడెం వెళ్లి బాధితుల బంధువులను పరామర్శించి మరణాలు ఇతర వ్యాధుల వల్ల మాత్రమే సంభవిస్తున్నాయని, ప్రతిపక్షాలు రాద్ధాంతం అర్థరహితమని కొట్టి పారేశారు. చంద్రబాబు పర్యటన తర్వాత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.