Supreme Court: నేడు సుప్రీంకోర్టు ముందుకు అమరావతి రాజధాని అంశం

నేడు సుప్రీంకోర్టు ముందుకు అమరావతి రాజధాని అంశం రానుంది. దీనిపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును గత నెలలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసిన విషయం తెలిసిందే. 2,000 పేజీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని ఎస్ఎల్పీలో సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.

Supreme Court: నేడు సుప్రీంకోర్టు ముందుకు అమరావతి రాజధాని అంశం రానుంది. దీనిపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును గత నెలలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసిన విషయం తెలిసిందే. 2,000 పేజీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని ఎస్ఎల్పీలో సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.

రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ ప్రభుత్వం అంటోంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్ లో చెప్పింది.

అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే తమ వాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అమరావతి రైతులు కెవియేట్ పిటిషన్లు దాఖలు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు