TTD: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొత్తం 182 గంటల దర్శన సమయంలో సామాన్య భక్తులకు 164 గంటలు కేటాయిస్తామన్నారు. తొలి మూడు రోజులు రూ.300తో పాటు శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15,000 రూ.300 దర్శన టిక్కెట్లతో పాటు 1,000 శ్రీవాణి టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో ఇస్తామన్నారు. (TTD)