TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. రెండు నెలలు నో ఛాన్స్..! వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala Tirupati Devasthanam

TTD: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తుంటారు. దీంతో ప్రతీ వేసవికాలం సెలవుల్లో రెండు నెలలు తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: Horoscope Today: బలహీనుడైన చంద్రుడు.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘వేసవికాలం రెండు నెలలు వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. మే, జూన్ రెండు నెలలపాటు సెలవుల నేపథ్యంలో కుటుంబాలతో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, భక్తులు ఇబ్బందులు పడకూదడనే ఉద్దేశంతోనే మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫార్సు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ తెలిపారు.’’

Also Read: నిన్ననే భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సి ఉంది.. కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయాను: హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ

వేసవి సెలవులు, వారాంతం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులతో శ్రీవారి మెట్టు మార్గంలో శనివారం తెల్లవారు జామునుంచే ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు గరుడ సర్కిల్ వరకు బారులు తీరాయి.

మరోవైపు.. జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. జీఎన్సీ టోల్ గేట్, అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. భక్తుల పూర్తి వివరాలు తెలుసుకోవడంతోపాటు.. వాహనాలు, భక్తుల లగేజీలను పరిశీలించి పంపుతున్నారు.