నిన్ననే భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సి ఉంది.. కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయాను: హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ

గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని చెప్పారు.

నిన్ననే భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సి ఉంది.. కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయాను: హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ

Updated On : April 26, 2025 / 5:04 PM IST

నిన్ననే తాను భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సి ఉందని.. కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ 2025లో పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని చెప్పారు.

పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, విపక్షాలను అణగదొక్కడమే అధికార పార్టీకి పనిగా మారిందని చెప్పారు. మీడియా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని అన్నారు.

సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందని రాహుల్ అన్నారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని పిలుపునిచ్చారు. కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని తెలిపారు.

విద్యతో పాటు వైద్యం వంటి రంగాలపై కొత్త పాలసీలను రూపొందించుకోవాలని అన్నారు. విద్వేష రాజకీయాలను మార్చాలని తాను తన పాదయాత్ర ద్వారా అర్థం చేసుకున్నానని తెలిపారు. మన దేశంలో కొత్త రాజకీయాలను నిర్మిద్దామని అన్నారు.

Also Read: పాక్‌తో ఇక ఐసీసీ టోర్నీల్లోనూ భారత్‌ ఆడకూడదు అంతే..: గంగూలీ

పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆలోచించానని, మొదలు పెట్టాక వెనకడుగుడు వేయలేదని తెలిపారు. పాదయాత్ర మొదలుపెట్టాక చాలా మంది తనతో కలిసి నడవడం ప్రారంభించారని, పాదయాత్రలో జనం సమస్యలను వినడం నేర్చుకున్నానని రాహుల్ చెప్పారు.