TTD Laddu Row : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై టీటీడీ ఈవో శ్యామల రావు స్పందించారు. లడ్డూ నాణ్యతపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారని ఆయన తెలిపారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని ఫిర్యాదు వచ్చిందన్నారు. నెయ్యి నాణ్యత బాగోలేదని భక్తులు ఫిర్యాదు చేశారని ఈవో వెల్లడించారు. లడ్డూ తయారీకి నాణ్యమైన నెయ్యి వాడాల్సి ఉందన్నారు. నెయ్యి తయారీలో జంతువుల కొవ్వు వాడుతున్నట్లు సీఎం చంద్రబాబు గతంలోనే అనుమానం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నెయ్యి సరఫరాదారులకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేసే వాళ్లు నాణ్యత కూడా పాటించరని ఆయన వ్యాఖ్యానించారు. నెయ్యి నాణ్యత టెస్టింగ్ కోసం టీటీడీకి ఇప్పటివరకు సొంత ల్యాబ్ కూడా లేదన్నారు ఈవో శ్యామలరావు. ఏఆర్ డైరీ నుంచి సరఫరా అయిన నెయ్యిని టెస్టింగ్ కోపం పంపించామన్నారు ఆయన తెలిపారు.
Also Read : వైసీపీలోకి వెళ్లి తప్పు చేశామా? కరుడుకట్టిన ఆ ఇద్దరు టీడీపీ నేతల్లో అంతర్మథనం..!
”తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని గమనించాము. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ దర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.75లక్షలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటయ్యేది. కానీ, గత ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు” అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.