TTD
Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి మే నెల టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ (మంగళవారం) ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం ఇవాళ ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12గంటలలోపు సొమ్ము చెల్లించినవారికి లక్కీడీప్ లో టికెట్లు మంజూరవుతాయి.
Also Read: Cm Chandrababu : రాష్ట్రంలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నాం- సీఎం చంద్రబాబు
♦ ఈనెల 21వ తేదీన ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను, వర్చువల్ సేవా టికెట్లను ఇదేరోజు మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు.
♦ 22వ తేదీన ఉదయం 10గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, ఉదయం 11గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం 3గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
♦ 24వ తేదీన ఉదయం 10గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా, మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి, తిరుమలలో అద్దె గదుల కోటాను విడుదల చేయనున్నారు.
♦ భక్తులు ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చు.