Tirupati Accident : తిరుపతి శ్రీనివాససేతు ఫ్లైఓవర్ పై ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు

రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి, కారును తొలగించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Cars Accident

Two cars collided : తిరుపతి శ్రీనివాససేతు ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఓ కారు ఫ్లైఓవర్ పైనే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి, కారును తొలగించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధమైంది. భక్తులు తిరుమలకు వెళ్తుండగా కారు ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును సైడ్ కు నిలిపి కారులో ఉన్న వారు బయటికి పరుగులు తీశారు. చూస్తూవుండగానే కారు కాలిపోయింది.

Car Burnt : తిరుమలకు వెళ్తుండగా రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధం

తిరుపతి నుండి తిరుమలకు వస్తుండగా కారులో మంటలు చెలరేగడంతో భక్తులు హడలిపోయారు. కారు దిగిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. పొగను గుర్తించిన భక్తులు కారు దిగి చూస్తుండగానే మంటలు రాజుకున్నాయి. ఆ తర్వాత కారు పూర్తిగా దగ్ధమైంది.

దీంతో ఘాట్ రోడ్డులో మూడు కిలో మీటర్లు మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కర్నూలుకు చెందిన భక్తులు.. ఆ సమయంలో ఇద్దరు మాత్రమే కారులో ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం నష్టం జరగలేదు. ఎవరికి కూడా గాయాలు కాలేదు. వారు సురక్షితంగా ప్రమాదం బయటపడ్డారు.