Tirumala Car burnt : తిరుమలకు వెళ్తుండగా రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధం

తిరుపతి నుండి తిరుమలకు వస్తుండగా కారులో మంటలు చెలరేగడంతో భక్తులు హడలిపోయారు. కారు దిగిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. పొగను గుర్తించిన భక్తులు కారు దిగి చూస్తుండగానే మంటలు చెలరేగాయి.

Tirumala Car burnt : తిరుమలకు వెళ్తుండగా రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధం

Car Burn

Updated On : March 19, 2022 / 4:17 PM IST

Tirumala Car burnt : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ కారు దగ్ధమైంది. భక్తులు తిరుమలకు వెళ్తుండగా కారు ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును సైడ్ కు నిలిపి కారులో ఉన్న వారు బయటికి పరుగులు తీశారు. చూస్తూవుండగానే కారు కాలిపోయింది.

తిరుపతి నుండి తిరుమలకు వస్తుండగా కారులో మంటలు చెలరేగడంతో భక్తులు హడలిపోయారు. కారు దిగిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. పొగను గుర్తించిన భక్తులు కారు దిగి చూస్తుండగానే మంటలు రాజుకున్నాయి. ఆ తర్వాత కారు పూర్తిగా దగ్ధమైంది.

Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు

దీంతో ఘాట్ రోడ్డులో మూడు కిలో మీటర్లు మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కర్నూలుకు చెందిన భక్తులు.. ఆ సమయంలో ఇద్దరు మాత్రమే కారులో ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం నష్టం జరగలేదు. ఎవరికి కూడా గాయాలు కాలేదు. వారు సురక్షితంగా ప్రమాదం బయటపడ్డారు.

కారు పాతది కావడం, దానిలో వైరింగ్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. విషయాన్ని తెలుసుకున్న తిరుమల అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.