Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు

వసతి దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాలు బారులు తీరాయి. కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.

Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు

Tirumala

Tirumala Devotees : తిరుమల భక్తజన సంద్రమైంది. శ్రీవెంకటేశ్వరసన్నిధికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులు కావడంతో తిరుమలకు శ్రీవారి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తజనంలో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. వసతి దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాలు బారులు తీరాయి. కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.

తిరుమల శ్రీవారిని దర్శనార్థం టీటీడీ టిక్కెట్లను మార్చి 21న రిలీజ్ చేయనుంది. ఈ మేరకు చేసిన ప్రకటనలో రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలల రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను మార్చి 21 నుంచి 3 రోజుల పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ నెల కోటాను మార్చి 21న, మే నెల కోటాను మార్చి 22న, జూన్ నెల కోటాను మార్చి 23న విడుదల చేస్తారు. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నార్థం సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30 వేల టిక్కెట్లు మంజూరు చేస్తారు.

Car Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా రూ.17 లక్షల విలువైన కారు

మరోవైపు వెంకన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.

శ్రీవారికి.. నిత్య సేవల్లో భాగంగా.. సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, అష్టద‌ళ‌ పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లు నిర్వహిస్తారు. కోవిడ్‌-19 ప‌రిస్థితులకు ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగుతుంది.