Tirupati Flyover Construction : తిరుపతిలో ఫ్లైవోవర్ నిర్మాణం పనుల్లో ప్రమాదం.. క్రేన్ వైర్లు తెగి సిమెంట్ దిమ్మె కిందపడి ఇద్దరు కూలీలు మృతి

సిమెంట్ సెగ్మెంట్ అమర్చి కాంక్రీట్ వేస్తే ఫ్లైవోవర్ పూర్తి అయిపోయినట్లే. అలాంటి ఆఖరి సిమెంట్ సెగ్మెంట్ ను క్రేన్ తో పైకి లేపి అమర్చుతుండగా ఒక్కసారిగా క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో దానికి వేలాడుతున్న భారీ సిమెంట్ దిమ్మ దాదాపు ముప్పై అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది.

Tirupati Flyover Construction : తిరుపతిలో ఫ్లైవోవర్ నిర్మాణం పనుల్లో ప్రమాదం.. క్రేన్ వైర్లు తెగి సిమెంట్ దిమ్మె కిందపడి ఇద్దరు కూలీలు మృతి

Srinivasa Sethu flyover

Updated On : July 27, 2023 / 7:39 AM IST

Srinivasa Sethu Flyover – Two Died : తిరుపతిలో ఫ్లైవోవర్ పనుల్లో ప్రమాదం జరిగింది. శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల్లో క్రేన్లు వైర్లు తెగిపోయాయి. చివరి సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పశ్చిమ బెంగాల్, బీహార్ వాసులుగా గుర్తించారు. మరో వారం రోజుల్లో ఈ ఫ్లైవోవర్ నిర్మాణం పనులు పూర్తి కావాల్సివుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ సిమెంట్ దిమ్మెలతోనే ఫ్లైవోవర్ మొత్తాన్ని నిర్మిస్తున్నారు.

ఇది తిరుపతి చరిత్రలోనే కీర్తి కిరీటంగా చెప్పవచ్చు. మొత్తం తిరుపతి ట్రాఫిక్ సమస్యకు పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టేందుకు గత మూడేళ్లుగా శ్రీనివాస సేతు ఫ్లైవోవర్ నిర్మాణం పనులు అత్యంత చురుకుగా సాగుతున్నాయి. ఫస్ట్ పేస్, సెకండ్ పేస్ పూర్తి అయింది. ఇక థర్డ్ పేస్ చిరవి దశలో మాత్రమే ఉంది. కచ్చితంగా ఆగస్టు మొదటివారంలో శ్రీనివాస్ సేతు ఫ్లైవోవర్ ను అట్టహాసంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మొత్తం ఫ్లైవోవర్ నిర్మాణంలో ఇది ఆఖరి సిమెంట్ సిమెంట్ దిమ్మె.

సిమెంట్ సెగ్మెంట్ అమర్చి కాంక్రీట్ వేస్తే ఫ్లైవోవర్ పూర్తి అయిపోయినట్లే. అలాంటి ఆఖరి సిమెంట్ సెగ్మెంట్ ను క్రేన్ తో పైకి లేపి అమర్చుతుండగా ఒక్కసారిగా క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో దానికి వేలాడుతున్న భారీ సిమెంట్ దిమ్మ దాదాపు ముప్పై అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. అదే సమయంలో కిందనే ఉన్న ఇద్దరు కూలీలు ఘటనాస్థలంలోనే మరణించారు. పూర్తిగా సిమెంట్ దిమ్మ కింద ఇద్దరు నుజ్జునుజ్జు అయ్యారు. మరో క్రేన్ తో అత్యంత కష్టం మీద సిమెంట్ దిమ్మెను పక్కకు జరిపి మృతదేహాలను వెలికి తీశారు.

మొత్తంగా ఇది అపశృతిగా భావించాల్సివుంటుంది. నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో ప్రమాదం ఎలా జరిగిందని అనుకుంటున్నారు. ఘటనాస్థలానికి అధికారులు, ఎమ్మెల్యే కూడా చేరుకున్నారు. అసలు ఏం జరిగింది? అంత బరువులను లిఫ్ట్ చేస్తుండగా వైర్లు ఎలా తెగాయి? ముందే ఈ వ్యవహారాలను చూసుకోలేదా అన్న అంశాలపై అధికారులు సమీక్ష జరుపుతున్నారు.

మొత్తం మీద ఈ ఘటన తిరుపతి వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా చేసింది. గతంలో ఏడాది క్రితం ఇదే ఫ్లైవోవర్ సమెంట్ దిమ్మె జారి కింద పడింది. ఆ ఘటన సంచలనంగా మారింది. నగర వాసులు ఉలిక్కి పడ్డారు.ఈ నేపథ్యంలో మళ్లీ ఇవాళ భారీ సిమెంట్ దిమ్మె కింద పడి ఇద్దరు చనిపోవడం అనేది ఆశ్చర్యకరంగా మారింది. అయితే అధికారులు ఫ్లైవోవర్ మొత్తాన్ని ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది.