Vallabhaneni Vamsi Arrest : నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదు, ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు- వంశీ భార్య పంకజశ్రీ

వంశీని అరెస్ట్ చేసి ఇంత సమయం అవుతున్నా ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడం ఇల్లీగల్ అని ఆమె అన్నారు.

Vallabhaneni Vamsi Arrest : తన భర్త వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇంకా తనకు తెలియదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు తనకు ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదన్నారు. ఎఫ్ఐఆర్ ఇవ్వాలని అడిగినా పోలీసులు ఇవ్వడం లేదన్నారు. వంశీని రిమాండ్ కి తీసుకుని వెళ్ళినప్పుడు అన్నీ ఇస్తామని అంటున్నారని చెప్పారు.

Also Read : వల్లభనేని వంశీ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

వంశీని అరెస్ట్ చేసి ఇంత సమయం అవుతున్నా ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడం ఇల్లీగల్ అని ఆమె అన్నారు. ఎఫ్ఐఆర్ లేకపోతే లీగల్ గా వెళ్లడానికి మాకు అవకాశం ఉండదనే పోలీసులు ఇలా చేస్తున్నారని పంకజశ్రీ ఆరోపించారు.

 

”ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో గ్రౌండ్ రీజన్స్ ఇంకా చెప్పడం లేదు. రిమాండ్ కి తీసుకెళ్లినప్పుడు అన్నీ ఒకేసారి ఇస్తామంటున్నారు. ఇప్పుడే ఏమీ ఇవ్వము. రిమాండ్ కి తీసుకెళ్లినప్పుడు అన్ని పేపర్లు ఒకేసారి ఇస్తామని పోలీసులు చెప్పారు. ఒక మనిషిని అరెస్ట్ చేసి ఇంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షనే. నేను వంశీతో మాట్లాడాను. ఇప్పటివరకు ఆయన బాగానే ఉన్నారు” అని వంశీ భార్య పంకజశ్రీ తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. పోలీస్ భద్రత మధ్య వంశీని విజయవాడ తరలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే ఆయనను పోలీసులు విచారిస్తున్నారు.

Also Read : వల్లభనేని వంశీ అరెస్టు.. విజయవాడ చేరుకున్నాక ట్విస్టుల మీద ట్విస్టులిచ్చిన పోలీసులు.. వంశీ సతీమణి వాహనం అడ్డగింత

వంశీని విజయవాడ తరలించిన సమయంలో పోలీసులు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ నేతలు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో ముందస్తుగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ 30 చట్టం అమలు చేస్తున్నట్లు ఎస్పీ గంగాధర్ తెలిపారు. ర్యాలీలు, సభలు నిషేధమని.. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.