వల్లభనేని వంశీ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేసిన విషయం విధితమే..

వల్లభనేని వంశీ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Somireddy Chandra Mohan Reddy

Updated On : February 13, 2025 / 1:09 PM IST

Somireddy Chandra Mohan Reddy: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీస్ భద్రత మధ్య వంశీని విజయవాడ తరలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వంశీని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వంశీ అరెస్టుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Mohan Babu : మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. ఆ కేసులో ముందస్తు బెయిల్..

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన క్రూరమృగం వల్లభనేని వంశీ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వంశీతోపాటు మరో నలుగురైదుగురిని కూడా ఊచలు లెక్కపెట్టించి తీరాలి. అరెస్టు సమయంలో వంశీ డ్రామాలాడాడు. దుస్తులు మార్చుకొని వస్తానని గదిలోకి వెళ్లి అందరికీ ఫోన్లు చేసి అల్లర్లు చేయాలని రెచ్చగొట్టాడు. వైసీపీ హయాంలో వంశీ వాగుడు అందరికీ గుర్తుంది. అసలు తాను మనిషి జన్మ ఎత్తలేదన్నట్లుగా వంశీ ప్రవర్తించాడు. ఏం పీకుతారంటూ ఎగిరెగిరిపడి.. ఎన్నికల ఫలితాల రోజు మొదటి రౌండ్ కే పారిపోయిన పిరికిపంద వంశీ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Also Read: దడపుట్టిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన వైరస్.. అప్రమత్తమైన అధికారులు

ఎన్నికల్లో ఓటమి తరువాత వల్లభనేని వంశీ శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడేందుకు కూడా ప్రయత్నాలు చేశాడు. చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వందల తప్పులు చేయడం వైసీపీ నైజం. వంశీని ఇన్నాళ్లు ఎలా ఉపేక్షించారో అర్ధం కావట్లేదు. రాయలసీమలో అయితే వ్యవహారం ఇంకోలా ఉండేది. వంశీ ప్రవర్తన ఖండించకపోగా వైసీపీ సీనియర్లు సమర్ధించడం దురదృష్టకరం అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.