Vangaveeti Radha Janasena : జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై వంగవీటి రాధ క్లారిటీ

జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, వంగవీటి రాధాకృష్ణ కలయిక రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది. రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి వెళ్తున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి.(Vangaveeti Radha Janasena)

Vangaveeti Radha Janasena : జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, వంగవీటి రాధాకృష్ణ కలయిక రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది. రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి వెళ్తున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై వంగవీటి రాధ క్లారిటీ ఇచ్చారు.

”మా ఆఫీస్ పక్కనే జనసేన నేతలు ఆదివారం సమావేశం పెట్టుకున్నారు. ఈరోజు నాదెండ్ల మనోహర్ అక్కడికి వచ్చారు. పక్కనే ఉన్న మా కార్యాలయానికి మనోహర్ వచ్చారు. టీ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాం. రాజకీయ చర్చలు ఏమీ లేవు. సరదాగా చాలా మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నాకు తెలియదు. మీడియా వాళ్లు లేనిపోని హడావుడి చేయకండి. టీ తాగడానికి మాత్రమే మనోహర్ వచ్చారు. కలిసి టీ తాగాం” అని వంగవీటి రాధ అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వంగవీటి రాధాకృష్ణతో భేటీపై అటు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ”జనసేన జనవాణి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించాను. పక్కనే రాధా ఆఫీసు ఉండటంతో అక్కడికి వెళ్లాను. రాధాను మర్యాదపూర్వకంగా కలిశాను. మా మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు లేవు. టీ తాగి, కాసేపు కుశల సమాచారాలు మాట్లాడుకున్నాం. కరెంట్ ఎఫైర్స్ కాదు.. కరెంటు ఛార్జీలు గురించి చర్చించాం” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Vallabhaneni Vamsi Vangaveeti Radha : గన్నవరంలో ఏం జరుగుతోంది? వంశీ, వంగవీటి రాధ మధ్య ఏకాంత చర్చలు

ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం పూర్తిస్థాయిలో అండగా నిలవనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. జులై 3న విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను పరిశీలించేందుకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంకు వెళ్లిన నాదెండ్ల మనోహర్.. అక్కడ మీడియా సమావేశం పూర్తైన వెంటనే వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లి, రాధాతో కాసేపు భేటీ అయ్యారు.

కొడాలి నానితో వంగవీటి భేటి.. దేవినేనికి చెక్ చెప్పేందుకేనా?

ఈ భేటీతో వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. వంగవీటి కుటుంబానికి ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఇప్పుడు వంగవీటి రాధ జనసేనలో చేరితే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే, జనసేనలో చేరిక వార్తలను వంగవీటి రాధా సింపుల్ గా తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని, జస్ట్ కలిసి టీ తాగామని వెల్లడించారు.

గతంలోనూ వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో ఓటమిపాలైన రాధా.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అక్కడ తగినంత గుర్తింపు ఇవ్వకపోవడంతో 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. టీడీపీ తరపున పోటీ చేయకపోయినా.. ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ రాధా మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు