Tirumala Tirupati : సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోండి.. అందరికీ అవకాశం వస్తుంది

ప్రతొక్కరు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని, హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన...

Vice President Venkaiah Naidu : ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. నిత్యం తిరుమల ప్రాంతం సందడిగా సందడిగా ఉంటుంది. అయితే.. శ్రీ వారి దర్శన విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వామి వారిని దర్శించుకోవాలని సూచించారు. దీనికి గల కారణం కూడా చెప్పారు. ఇలా చేయడం వల్ల అందరికీ అవకాశం దక్కుతుందన్నారు. 2022, ఫిబ్రవరి 10వ తేదీ గురువారం కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More : Sumanth : ఇప్పుడు విడాకులు అనేవి కామన్.. విడాకులపై హీరో సుమంత్ వ్యాఖ్యలు..

శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అంది కూడా ప్రాత:కాలాన కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. దర్శనంతో లభించిన సంతృప్తి, సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కలుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్య నూతనోత్సాహం కలుగుతుందన్నారు. ప్రతొక్కరు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని, హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.

Read More : UP Election 2022: ప్రారంభమైన యూపీ ఎన్నికల పోలింగ్.. బరిలో 623 మంది అభ్యర్థులు

తన మనుమరాలు సుష్మ వివాహం సందర్భంగా తిరుమలకు రావడం జరిగింది ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. 2020, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడ మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు, ఇతరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన భవనంలోకి తీసుకెళ్లారు. ఆయన మనవరాలి పెళ్లి…తిరుచానూరులో ఓ కళ్యాణమండపంలో వివాహం జరుగనుంది. తిరుమలలోని కళ్యాణ వేడుక జరుపుకోనున్నట్లు సమాచారం. తిరుచానూరు ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు