Vijayasai Reddy: పుష్ప సినిమాలో అందుకే చంద్రబాబు ఫొటో పెట్టారు: విజయసాయిరెడ్డి

‘ పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రాగానే అందులో తానున్నానంటూ బాబుగారి బిల్డప్ ’ అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.

Vijayasai Reddy - Pushpa

Vijayasai Reddy – Pushpa: తెలుగు సినిమా పుష్పకు రెండు జాతీయ అవార్డులు రావడం, ఆ సినిమాలో దర్శకుడు సుకుమార్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) ఫొటోను వాడడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ సినిమాలో తన ఫొటో ఉందని వైసీపీ (YCP) నేతలు ఏడుస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ సెటైర్లు వేశారు. ” పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రాగానే అందులో తానున్నానంటూ బాబుగారి బిల్డప్. ‘పుష్ప చిత్రంలోని ఓ సీన్లో పోలీస్ స్టేషన్ గోడకు వేలాడుతూ నా ఫోటో ఉంది. అందుకే అవార్డు వచ్చింది’ అని అంటున్నారు చంద్రబాబు. అవును… ఆయన హయాంలో ఎర్రచందనం విచ్చలవిడిగా స్మగుల్ అయ్యిందని అందుకే పోలీసు స్టేషన్లో ఆయన ఫొటో పెట్టరాని జనం అంటున్నారు ” అని ట్వీట్ చేశారు.

కాగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ అత్యుత్తమ నటనకుగాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించిన విషయం తెలిసిందే. అలాగే, ఉత్తమ సంగీతం విభాగంలో పుష్ప పాటలకు దేవీ శ్రీ ప్రసాద్, ఆర్‌ఆర్‌ఆర్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ఎం.ఎం.కీరవాణి జాతీయ అవార్డు అందుకోనున్నారు.

Kushi : ఖుషిలో ఆ సీన్ చేయించడం కోసం విజయ్, సమంత.. వెన్నల కిశోర్‌ని ఎంతో రిక్వెస్ట్ చేశారట..

ట్రెండింగ్ వార్తలు