Kushi : ఖుషిలో ఆ సీన్ చేయించడం కోసం విజయ్, సమంత.. వెన్నల కిశోర్‌ని ఎంతో రిక్వెస్ట్ చేశారట..

ఖుషి సినిమాలో ఒక సీన్ చేయడానికి వెన్నల కిశోర్‌ని విజయ్ దేవరకొండ అండ్ సమంత ఎంతోసేపు బ్రతిమాలి ఒప్పించారట. ఇంతకీ ఆ సీన్ ఏంటో తెలుసా..?

Kushi : ఖుషిలో ఆ సీన్ చేయించడం కోసం విజయ్, సమంత.. వెన్నల కిశోర్‌ని ఎంతో రిక్వెస్ట్ చేశారట..

Vijay Deverakonda Samantha requesting Vennela Kishore to do action scene in Kushi

Updated On : August 27, 2023 / 4:36 PM IST

Kushi : శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషి’. లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక రిలీజ్ దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈక్రమంలోనే విజయ్, సామ్, శివ నిర్వాణ, వెన్నల కిశోర్ (Vennela Kishore) కలిసి యాంకర్ సుమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Kushi : మణిరత్నం ‘సఖి’ రిఫరెన్స్‌తోనే విజయ్ ‘ఖుషి’ తెరకెక్కిందా..? శివ నిర్వాణ కామెంట్స్..!

ఈ ఇంటర్వ్యూలో మూవీలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి తెలియజేశారు. వెన్నల కిశోర్ కి యాక్షన్ సీన్స్ చేయాలంటే భయం అంటా. అందుకనే ఆ సీన్స్ చేయడానికి అసలు ఒప్పుకోడట. ఇక ఖుషి మూవీలో ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉందట. ఆ సీక్వెన్స్ లో వెన్నల కిశోర్ కి కూడా నటించాలి. అయితే శివ నిర్వాణ స్టోరీ చెప్పినప్పుడు కిశోర్ కి ఈ విషయం చెప్పలేదు. కాశ్మీర్ లో సీన్ షూటింగ్ ముందు ఈ విషయం చెప్పాడట. ఇక కిశోర్ తన పాత్రని ఆ సీన్ లో నుంచి తీసేయండి అని చెప్పాడట.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఎమోషన్ ట్వీట్.. ‘అది నా పిల్ల’..!

అయితే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో విజయ్ అండ్ సమంత.. వెన్నల కిశోర్ ని కూర్చోబెట్టి చాలా సేపు రిక్వెస్ట్ చేశారట. నీ పక్కన మేము ఉంటాము అని ధైర్యం చెప్పి, తను సీన్ చేస్తున్న సమయంలో పక్కనే ఉండే ప్రోత్సహిస్తే గాని వెన్నల కిశోర్ ఆ సీన్ చేయలేదట. ఇక ఈ సీన్ తరువాత.. విజయ్ కాశ్మీర్ లోని ఒక నదిలో బైక్ స్టంట్ చేస్తున్న సమయంలో చిన్న యాక్సిడెంట్ జరిగిందట. అది చూసిన వెన్నల కిశోర్..’ బాగా అయ్యిందా’ అని విజయ్ ని ఆట పట్టించాడట.