Vijayawada
Vijayawada : నమ్మకమే పెట్టుబడిగా వంచిస్తున్న కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసే కంపెనీలు రోజుకో చోట బయటపడుతూనే ఉన్నాయి. అవకాశాల పేరిట ఉద్యోగార్థులను మోసం చేస్తూనే ఉన్నారు కేటుగాళ్లు. డిగ్రీలు చేతబట్టుకొని జీవిత పోరాటం కోసం ఆరాటపడుతున్న నిరుద్యోగుల నుంచి ఉల్టా డబ్బులు తీసుకుంటూ మోసం చేస్తున్నారు. ఉద్యోగాల ఆశ చూపి అందినకాడికి దండుకుంటున్నారు మహామోసగాళ్లు. ఫేక్ కంపెనీలు సృష్టించి నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు.
చదవండి : దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై యువకుల యాక్షన్, పోలీసుల రియాక్షన్
తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడలో వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసింది ఓ ఫేక్ కంపెనీ.. శ్రీరామచంద్రనగర్ లో ఉన్న ‘TNT Eperts’ కంపెనీ ఘరానా మోసం బయటపడింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిండా ముంచింది ఆ కంపెనీ.. ట్రైనింగ్ కోసమని ఒక్కో విద్యార్థి నుంచి 10 వేల రూపాయాలను వసూలు చేశాడు కంపెనీ ఎండీ పవన్ కుమార్. ఇలా 300 మంది నిరుద్యోగుల వద్ద 39 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అంతే కాదు ఒక్కో నిరుద్యోగి 150 మందిని జాయిన్ చేస్తే పారితోషకం ఇస్తానని ప్రకటించాడు పవన్ కుమార్.
చదవండి : సరస్వతి దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ-దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
అయితే ఎంతమంది జాయిన్ అయినప్పటికీ శాలరీలు మాత్రం ఇవ్వడం లేదు. డబ్బులు గుంజుకొని ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదని వాపోతున్నారు బాధితులు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో లబోదిబో అంటున్నారు. తమకు న్యాయం చేయాలనీ పోలీసులను వేడుకుంటున్నారు.