Dasara Festival Vijayawada : సరస్వతి దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ-దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రి పై జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నా

Sarswathi Alankaram Vijayawada
Dasara Festival Vijayawada : విజయవాడ ఇంద్రకీలాద్రి పై జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈరోజు 6 వ రోజు… ఆశ్వయుజ శుద్ధ సప్తమి మంగళవారం ఎంతో విశిష్టమైన రోజు. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలు జరిగే అన్ని రోజులలో ప్రత్యేకత సంతరించుకునేది కూడా మూల నక్షత్రంనాడే. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్నాహ్నం 3 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
సరస్వతీ దేవి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రులలో మూల నక్షత్రంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. ఎందుకంటే అమ్మవారు జన్మించిన నక్షత్రం మూలా.. నేడు 6 వ రోజు అమ్మవారు సరస్వతి దేవిగా బంగారు వీణ ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు..మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి గా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవి తన నిజ స్వరూపంతో సాక్షాత్కారింప చేయడమే శ్రీ సరస్వతి దేవి అలంకారం యొక్క విశిష్టత.
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||
విద్యార్దినీ విద్యార్దులకు చదువుల తల్లి సరస్వతీ అంటే అమితమైన ఇష్టం… అనుగ్రహం కోరిన వారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను శ్రీ సరస్వతి దేవి ప్రసాదిస్తుంది..మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు పుణ్యదినాలుగా బావించి దుర్గాదేవిని ఆరాధిస్తారు. భక్తుల అజ్హ్నాన్ని ప్రారద్రోలి జ్ఞాన జ్యోతి ని వెలిగించే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ..సరస్వతి దేవి విద్యాభ్యుదయప్రదాయకమని విశ్వాసం.

Vijayawada Piligrims
దసరా ఉత్సవాలలో మూల నక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు లక్షల్లో తరలివచ్చారు. ఈ రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు అర్ధరాత్రి 1 గంట నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు క్యూలైన్లు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ గాంధీ పార్కు వద్దనుంచి కొండమీద అమ్మవారి గుడివరకు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ నేపధ్యంలో ఆలయ అధికారులు పరిమితి విధించినప్పటికీ రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు చేపట్టారు.
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణినీ |
నిత్యం పద్మాలయాందేవీ సామాం పాతు సరస్వతీ ||
మూల నక్షత్రం సందర్బంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. నగరంలో ట్రాపిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపునుండి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తుండటంతో ఇప్పటికే ట్రయల్ నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి 3 గంటల నుండి మంగళవారం రాత్రి 11 గంటల వరకు అమ్మవారు భక్తులకు సరస్వతిదేవి గా దర్శనమిస్తారు.

Vijayawada Piligrims 2