Vijayawada Sub-Collector : మారు వేషంలో విజయవాడ సబ్ కలెక్టర్..ఎరువుల షాపుల్లో తనిఖీలు

విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మారు వేషంలో నగరంలో పర్యటించారు. సబ్ కలెక్టర్ మారు వేషంలో వెళ్లి ఎరువుల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు.

Vijayawada Sub-Collector : మారు వేషంలో విజయవాడ సబ్ కలెక్టర్..ఎరువుల షాపుల్లో తనిఖీలు

Updated On : August 7, 2021 / 12:02 PM IST

Vijayawada sub-collector in disguise : విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మారు వేషంలో నగరంలో పర్యటించారు. సబ్ కలెక్టర్ మారు వేషంలో వెళ్లి ఎరువుల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. ఓ దుకాణంలో వెళ్లి ఎరువులు కావాలని అడిగారు. అయితే స్టాక్ ఉన్నా షాప్ యజమాని లేవని చెప్పారు. సబ్ కలెక్టర్ అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.

సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చి MRP ధర కన్నా సదరు షాపు యజమాని అధికంగా వసూళ్లు చేశారు. వసూళ్లు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు. ఆ తర్వాత సబ్ కలెక్టర్ ఒకొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాపుకు పిలిపించారు. రెండు షాపులను సీజ్ చేయించారు.

అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు. ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసి వేసి ఉండటంతో అక్కడి రైతులను వాకబు చేశారు. MRP ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని రైతులు సబ్ కలెక్టర్ కు తెలిపారు. షాపు యజమానిని పిలిపించి అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.