Vijayawada West Bypass Road : ఏపీలో మరో కీలకమైన ప్రాజెక్ట్ అందుబాటులోకి రాబోతోంది. ఏపీ నలుమూలల నుంచి రాజధానికి వచ్చే వారికి రాచమార్గం అయ్యేలా నిర్మాణంలో ఉన్న విజయవాడ పశ్చిమ బైపాస్ సిద్ధమైంది.
ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్లేందుకు నిర్మించిన బైపాస్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ తో మొత్తం మూడు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాహనాలను అనుమతిస్తున్నా పూర్తి స్థాయిలో ఈ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉంది.
రాజధాని అమరావతికి నేషనల్ హైవేలతో కనెక్టివిటీని పెంచే పని..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నేషనల్ హైవేలతో కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది ఏపీ సర్కార్. అమరావతికి త్వరగా చేరుకునేలా బైపాస్ లని రాజధాని రోడ్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ మేరకు అమరావతి కనెక్టివిటీకి కీలకమైన విజయవాడ-పశ్చిమ బైపాస్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.
Also Read : నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
ఏప్రిల్ నెలలో బైపాస్ పాక్షికంగా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 48 కిలోమీటర్లు ఉన్న వెస్ట్ బైపాస్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఫేజ్ 3, ఫేజ్ 4 పనులు చివరి దశకు చేరుకున్నాయి.
సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగలేదు..
ఫేజ్ 3 చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు ఉంది. ఈ రోడ్డు పనులు దాదాపు 95శాతం పూర్తయ్యాయి. దీంతో ఇటీవల సంక్రాంతి సమయంలో అధికారులు, పోలీసులు పశ్చిమ బైపాస్ మీదుగా వాహనాల రాకపోకలను అనుమతించారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో గొల్లపూడి నుంచి నూతన బైపాస్ మీదుగా చిన్న అవుటపల్లికి మళ్లించారు. దీంతో సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి వైజాగ్, గోదావరి జిల్లాలకు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకపోవటంతో ట్రాఫిక్ ఇబ్బంది కలగలేదు.
Also Read : వైసీపీ నుంచి వలసలు.. నాగబాబు సంచలనం.. మంత్రి పదవిపై హాట్ కామెంట్స్..
విజయవాడ వెస్ట్ బైపాస్.. చిన్న అవుటపల్లి నుంచి ప్రారంభమై గొల్లపూడి వరకు ఫేజ్ 3గా తీసుకున్నారు. ఈ ఫేజ్ 3లో మొత్తం 30 కిలోమీటర్లు బైపాస్ నిర్మించారు. చిన్న అవుటపల్లి.. గన్నవరం సమీపంలో ఉంటుంది. మధ్య మధ్యలో ఒకటి రెండు బ్రిడ్జిలు తప్ప మిగిలినటువంటి రోడ్డంతా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వాహనాలను కూడా వదులుతున్నారు. అయితే, చిన్నఅవుట పల్లి నుంచి నున్న మీదుగా గొల్లపూడి వెళ్తుంది. అక్కడి నుంచి ఫేజ్ 4 పనులు ఉంటాయి. ఫేజ్ 4 పనుల్లో కృష్ణా నదిపై బ్రిడ్జి, రాజధానికి వెళ్లే ప్రాంతం ఉంటుంది.
వైజాగ్, కోస్తా జిల్లాల నుంచి అమరావతి, హైదరాబాద్ వెళ్లేందుకు ఈ హైవేనే చాలా ఎక్కువగా ఉపయోగపడబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే వారు విజయవాడ నగరంలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉండదు, నగరంలో ఉన్న ట్రాఫిక్ ను ఫేస్ చేయాల్సిన బాధ ఉందడు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే విజయవాడ నగరంలోనే గంటన్నర సమయం పట్టే పరిస్థితి. ఇక నుంచి ఈ హైవే సునాయాసంగా ఉంటుంది. కేవలం 20 నిమిషాల్లోనే చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు వెళ్తారు.