Visakhapatnam : ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లు చనిపోయిన రోజే..ఆడకవలకు జన్మనిచ్చిన తల్లి

పడవ ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన రోజునే రెండేళ్ల తరువాత అదే రోజున ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. దీంతో చనిపోయిన తమ కూతుళ్లుే మళ్లీ పిల్లలుగా పుట్టారని మురిసిపోతున్నారు.

Visakhapatnam : కాలం చేసే మాయ..విధి ఆడే వింత నాటకం ఎవ్వరికి అంతుబట్టదు. సంతోషంగా కాలం గడిపేసమయంలో పెను విషాదాన్ని నింపుతుంది. శోకంలో నిండిపోయినవారికి సంతోషాన్ని కలిగిస్తుంది. కాలం చేసే గాయాన్ని ఆ కాలమే మానేలా చేస్తుంది అనటానికి నిదర్శనంగా జరిగిన ఘటన ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన దంపతులకు జరిగింది. రెండేళ్ల క్రితం అంటే సెప్టెంబర్ 15,2019లో గోదావరిలో పడవ ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన దంపతులుకు అదే రోజున (సెప్టెంబర్ 15,2021) ఆ దంపతులకు కవల పిల్లలు పుట్టారు. దీంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.చనిపోయిన తమ కూతుళ్లే తమకు మళ్లీ కవలలుగా పుట్టారని సంబరపడిపోతున్నారు.

Read more : గోదావరి బోటు ప్రమాదం : 250 అడుగుల లోతులో.. పడవ ఆచూకీ

రెండేళ్లక్రితం గోదావరి పడవ ప్రమాదంలో చనిపోయిన 50 మందిలో ఈ దంపతుల ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. దీంతో శోకంలో మునిగిపోయిన జంట కొద్దికొద్దిగా కోలుకున్నారు. వారి బిడ్డలనుదూరం చేసినందుకు ఆదేవుడే బాధపడ్డాడేమో అన్నట్లుగా ప్రమాదం జరిగిన అదే సెప్టెంబర్ 15 సరిగ్గా రెండేళ్ల తర్వాత వారి ఇంట కవలల జన్మించటం కాలం ఆడిన వింత నాటకం అని అనకునేలా జరిగింది. ఈ విషాదం..వినోదానికి సంబంధించిన ఘటనలో వివరాల్లోకి వెళితే..రెండేళ్ల క్రితం అంటే 2019 సెప్టెంబరు 15న గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సుమారు 50 మంది మరణించగా వారిలో విశాఖపట్టణానికి చెందిన అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతుల ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. భద్రాచలం రాముల వారిని దర్శించుకోవటానికి వెళ్లిన అప్పలరాజు దంపతులు 11మంది బంధువులతో కలిసి వెళ్లారు. ఆ ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో అప్పలరాజు, భాగ్యలక్ష్మితో పాటు మరొకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.ఆ ప్రమాదంలో అప్పలరాజు దంపతులు ఇద్దరు కూతుళ్లు మూడేళ్ల గీతా వైష్ణవి. ఏడాది వయస్సున్న ధాత్రి అనన్య ను ఒకేసారి కోల్పోవటంతో ఆ దంపతుల వేదనకు అంతులేకండా పోయింది. కడుపు శోకంతో అల్లాడిపోయారు. ఆ గాయం నుంచికోలుకోలేకపోయారు. కాలమహిమ..కాలం చేసిన గాయాన్ని ఆ కాలమే మాన్పుతుంది అన్నట్లుగా రోజులు..వారాలు..నెలలు గడిచేకొద్ది ఆ జంట కోలుకున్నారు.

Read more : గోదావరి బోటు ప్రమాదం : 11కి చేరిన మృతుల సంఖ్య

అలా రెండేళ్ల తర్వాత అదే సెప్టెంబరు 15న ఆ దంపతులకు కవలలు పుట్టారు. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలే కావడం విశేషం. పండంటి పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి తనకు చాలా సంతోషంగా ఉందని..ఇది తమకు దేవుడిచ్చిన వరమని అంటోంది. చనిపోయిన తమ కూతుళ్లే తిరిగి అలాగే ఆడపిల్లలుగా పుట్టారని మేం అనుకుంటున్నామని తెలిపారు. ఆ జంట ఇంటిలో మళ్లీ బోసినవ్వులు విరియటంతో రెండేళ్ల తర్వాత ఆ ఇంట నవ్వులు పూస్తున్నాయి.

కాగా ఇద్దరు ఆడపిల్లల తరువాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న భాగ్యలక్ష్మి ఇద్దరు పిల్లలు చనిపోవటంతో తమకు పిల్లలు కావాలని ఆశపడ్డారు. ఏడాది క్రితం దీంతో ఫెర్టిలిటీ డాక్టర్ పి సుధా పద్మశ్రీని సంప్రదించారు. దీంతో డాక్టర్ సుధా IVF విధానం గురించి ఆ జంటకు వివరించారు. అలా చికిత్స చేయించుకుని గర్భం ధరించిన భాగ్యలక్ష్మి అక్టోబర్ 20కు డెలివరీ డేట్ ఇచ్చారు. కానీ కాలమహిమో లేక మరే కారణమో గానీ భాగ్యలక్ష్మికి సెప్టెంబర్ 15 న ప్రసవం నొప్పులు వచ్చారు. అలా ఆమె తన ఇద్దరు ఆడబిడ్డల్ని కోల్పోయిన అదే సెప్టెంబర్15న ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు