గోదావరి బోటు ప్రమాదం : 250 అడుగుల లోతులో.. పడవ ఆచూకీ

గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు

  • Published By: veegamteam ,Published On : September 16, 2019 / 02:15 AM IST
గోదావరి బోటు ప్రమాదం : 250 అడుగుల లోతులో.. పడవ ఆచూకీ

గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు

గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు తేలియాడుతున్న ఆనవాళ్లను గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలోనే బోటు మునిగిపోయి ఉంటుందని చెబుతున్నారు. బోటుని వెలికి తీస్తే కానీ అందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మునిగిపోయారు అనేదానిపై స్పష్టత రాదంటున్నారు. అలాగే గల్లంతైన వారి ఆచూకీ కూడా లభ్యమవుతుందని చెప్పారు. అయితే బోటుని బయటకు తియ్యడం అంత తేలికైన విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే.. 250 అడుగుల లోతులో ఉంది. బోటుని వెలికి తియ్యడం కోసం అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగిపోయింది. ఆదివారం(సెప్టెంబర్ 15,2019) మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

విహార యాత్ర విషాదంగా మారింది. గోదావరిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో పర్యాటక బోటు మునిగిపోయింది. ఇప్పటివరకు 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం 71మందితో పర్యాటక బోటు బయల్దేరింది. బోటులో 61మంది పర్యాటకులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 36మంది పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది. పాపికొండలు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. రాయల్ వశిష్ట బోటు నిర్వాహాకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైడ్ స్కాన్ సోనార్ టెక్నాలజీ ద్వారా మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

ఆదివారం(సెప్టెంబర్ 15,2019) ఉదయం 10.30 గంటలకు రాయల్ వశిష్ట టూరిస్ట్ బోటు పాపికొండలకు బయలుదేరింది. గండిపోచమ్మ ఆలయం దాటి… ముందుకు వెళ్తున్న క్రమంలో… దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది. వరద ఉధృతిని తట్టుకోలేక బోటు మునిగిపోయింది. లైఫ్ జాకెట్లు ఉన్న వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని.. చుట్టుపక్కల గ్రామస్తులు కాపాడారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 71మంది ఉన్నారు. అందులో 61మంది టూరిస్టులు, 10మంది బోటు సిబ్బంది ఉన్నారు.

Also Read : ఎండ తట్టుకోలేక ఏసీ రూమ్ లోకి వెళ్లిన మహిళలు : బోటులోనే ఎక్కువ మృతదేహాలు