టీచరేనా : విద్యార్థులను చితకబాదాడు

ఎంతో ఓపిక, సహనంతో ఉండాల్సిన టీచర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టీచింగ్ అంటే..పాఠాలు చెప్పడం మాత్రమే కాదు..పిల్లలతో పాటు కలిసి జీవించడం. వారిని అర్థం చేసుకోవడం..వారిలో ఒకరుగా మెలగడం. కానీ కొంతమంది టీచర్లకు ఓపిక అసలు ఉండడం లేదు. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చారని, పాఠాన్ని సరిగ్గా చెప్పలేదని, కొన్ని కారణాలతో విద్యార్థులను హింసిస్తున్నారు. గుంజీలు తీయించడం, ఎండలో నిలబెట్టడం, స్కూల్ చుట్టూ పరుగెత్తించడం లేకపోతే..చితకబాదడం వంటివి చేస్తున్నారు. అచ్చూ ఇలాగే అనాకపల్లిలోని స్కూల్ ప్రిన్స్ పాల్ చేశాడు.
విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లిలో ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులను చితకబాదాడు. స్కూల్లో కొందరు విద్యార్థులు వస్తువులు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు.. ప్రిన్సిపల్‌కు తెలిసింది. దీంతో.. అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఓ కర్రను తీసుకున్నాడు. చేయి చాచాలని విద్యార్థులను ఆదేశించారు. అరచేయిపై చితకబాదాడు.
ప్రిన్సిపల్ నిర్వాకంతో విద్యార్ధులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకేముంది..ఇంటికి వెళ్లిన తర్వాత..జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం స్కూల్ ప్రిన్స్ పాల్‌కు తెలిసింది. ఇక్కడుంటే..డేంజర్ అని భావించి కాలికి పనిచెప్పాడు. విద్యార్థులను కొడుతుండగా.. అక్కడే ఉన్న తోటి విద్యార్థులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో.. విషయం వెలుగు చూసింది.