Vizag Harbour Case : విశాఖ మత్స్యకారుల కొంపముంచిన ఉప్పుచేప.. బోట్ల అగ్ని ప్రమాదం ఘటనలో కీలక మలుపు!

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్ల ప్రమాదంలో మత్స్యకారులు తీవ్ర నష్టానికి గురి కావటానికి కారణం ఉప్పుచేపేనా..? బోట్ల అగ్ని ప్రమాదం జరగటానికి ఉప్పుచేప కారణమైందా..? ఉప్పుచేపకు అగ్నిప్రమాదానికి సంబంధమేంటి..?

Vizag Fishing Harbour Fire Incident

Visakh harbour boats fire case : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులకు తీవ్ర నష్టాన్ని కలిగించిన బోట్ల అగ్నిప్రమాదం ఘటన పెను సంచలన సృష్టించింది. తీవ్రంగా నష్టపోయామని గంగపుత్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోపక్క ఈ ప్రమాదం జరగటానికి కారణంపై విశాఖ పోటీసులు విచారణ ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా ఈకేసులో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు వ్యక్తులకు హార్బర్ నుంచి హడావిడిగా బయటకు వస్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. ఇది ఈకేసులో కీలక మలుపుకానుందని భావిస్తున్నారు.

ఈ అగ్నిప్రమాదం జరగటానికి కారణం ఓ ‘ఉప్పుచేప’ అని భావిస్తున్నారు. మద్యం తాగేందుకు అక్కడి వచ్చినవారి మద్యంలో నంజుకోవడానికి అక్కడే ఉప్పు చేపను కాల్చుకున్నారని..అదే అక్కడ బోట్ల ప్రమాదానికి కారణమైందని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఉప్పుచేపే జాలర్ల బోట్లు తగలబడటానికి కారణమా..? ఆ ఇద్దరే దీనికి కారణమా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉప్పుచేప కాల్చుకునే సమయంలోనే మంటలు చెలరేగి బోట్లను వ్యాపించినట్లుగా భావిస్తున్నారు. ఈ బోట్లల్లో పెట్రోల్, డీజిల్ భారీగా నిల్వ ఉంటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. భారీగా పేలుళ్లు సంభవించి ప్రమాదం పక్క బోట్లకు మంటలు వ్యాపించారు. దాదాపు 40 బోట్లు కాలి అగ్నికి ఆహుతి అయ్యాయి.

Also Read : Vizag Harbour : వైజాగ్‌ ఫిషింగ్‌ హార్బర్ ఘటనకి ఆ ఇద్దరే కారణమా? ఎవరు వారు..?

ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి విశాఖ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. ఈ ఫుటేజ్ లో ఇద్దరు వ్యక్తులు అక్కడినుంచి బయటకు వచ్చినట్లుగా స్పష్టంగా కనిపించింది. వారిని వాసుపల్లి నాని, సత్యం అనే వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు వాసుపల్లి నానిని ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. వాసుపల్లి నాని కోసం నాని మామ సత్యం ఉప్పుచేప ఫ్రై చేసినట్లుగా గుర్తించారు. ఈ మద్యం మత్తే ప్రమాదానికి కారణమైనట్లుగా తెలుస్తోంది. ఉప్పు చేప కాల్చే సమయంలో నిప్పు రవ్వలు ఎగసి బోటుపై ఉన్న వలపై పడటంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు అంతకంతకు వ్యాపించి వేరే బోట్లకు అంటుకున్నట్లుగా తెలుస్తోంది.

Also Read : Local Boi Nani : నేను ఏ తప్పూ చేయలేదు,నన్ను నమ్మండి .. మత్స్యకారుల కోసమే వీడియో తీసి పోస్ట్ చేశాను : లోకల్ బాయ్ నాని

ఈ కేసులో లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ అనుమానితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే  అతడిని విశాఖ క్రైమ్ బ్రాంచ్  పోలీసులు విచారించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోను నాని తన యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేయటంతో పోలీసులు ఆ దిశగా అనుమానాలు వ్యక్తంచేసి నానిని విచారించారు. కానీ తనకు.. ఈ ప్రమాద ఘటనకు ఎటువంటి సంబంధంలేదని.. తనను పోలీసులు అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అతడు మీడియా ముందు వాపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను తన స్నేహితులతో కలిసి వేరే ప్రాంతంలో పార్టీ చేసుకుంటున్నామని తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని  ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు