Vizag Harbour : వైజాగ్‌ ఫిషింగ్‌ హార్బర్ ఘటనకి ఆ ఇద్దరే కారణమా? ఎవరు వారు..?

విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ లను విడుదల చేశారు. ఈ ఫుటేజ్ లో కనిపించిన ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.

Vizag Harbour : వైజాగ్‌ ఫిషింగ్‌ హార్బర్ ఘటనకి ఆ ఇద్దరే  కారణమా? ఎవరు వారు..?

Visakha Fishing Harbor Incident

Vizag Harbour Incident Case : విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ లను విడుదల చేశారు.  రాత్రి 10.49 గంటలకు ఇద్దరు వ్యక్తులు హడావిడిగా బయటకు వచ్చినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపించింది.దీంతో పోలీసులు ఆ ఇద్దరు ఎవరు..? ఆ సమయంలో వారు అక్కడ ఎందుకున్నారు..? ప్రమాదం జరిగాక ఎందుకు అంత హడావిడిగా బయటకు వచ్చారు…? ఈ ప్రమాదం జరగటానికి కారణం వారేనా..? అనే కోణాల్లో విచారణను ముమ్మరం చేశారు.

కానీ ఈ కేసులో ఇప్పటికే లోకల్ బాయ్ నాని అనే యూటూబర్ అనుమానితుడిగా ఉన్నాడు. అతనిని ఇప్పటికే  పోలీసులు విచారించారు. పలు కోణాల్లో ప్రశ్నించారు. కానీ తనకు ..ఈ ప్రమాద ఘటనకు ఎటువంటి సంబంధంలేదని వాపోతున్నాడు నాని. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోను నాని తన యూటూబ్ చానల్ లో పోస్ట్ చేయటంతో పోలీసులు ఆ దిశగా అనుమానాలు వ్యక్తంచేసి నానిని విచారించారు.

Local Boi Nani : నేను ఏ తప్పూ చేయలేదు,నన్ను నమ్మండి .. మత్స్యకారుల కోసమే వీడియో తీసి పోస్ట్ చేశాను : లోకల్ బాయ్ నాని

కానీ తనను పోలీసులు అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని..తను విచారణ కోసం అని పిలిచి కొట్టారని .. ప్రమాదం జరిగిన సమయంలో తాను తన స్నేహితులతో కలిసి వేరే ప్రాంతంలో పార్టీ చేసుకుంటున్నామని కానీ తానే ఈ ప్రమాదానికి పాల్పడ్డానని పోలీసులు తనను వేధిస్తున్నారని..తనను జీవితాన్ని కాపాడాలంటూ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు.

కాగా..ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు 30మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారందరి సెల్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా ఎక్కడెక్కడ ఉన్నారు..?అనే యాంగిల్ లో విచారించారు. ఇలా పలు కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు మరింతగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.