volunteer kill old woman
Visakha – Pendurthi : విశాఖ జిల్లా పెందుర్తి సుజాతనగర్ లో దారుణం జరిగింది. బంగారం కోసం 72 ఏళ్ల వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడు. సుజాతనగర్ లోని 80 ఫీటు రోడులో ఈ ఘటన చోటు చేసుకుంది. 95వ వార్డులో వెంకటేష్ అనే యువకుడు వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరలక్ష్మీ అనే 72 ఏళ్ల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరించేందుకు ప్రయత్నించిన వాలంటీర్.. ఆ క్రమంలో ఆమెను హత్య చేశాడు. నెల రోజుల క్రితమే వరలక్ష్మీ కొడుకుకు చెందిన ఫుడ్ కోర్టులో వెంకటేష్ పనిలో చేరాడు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో వృద్ధురాలిని వెంకటేష్ హత్య చేసి బంగారంతో ఉడాయించాడు.
Jaipur Express Train : జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి
కొడుకు ఇంటికి వచ్చే సరికి తల్లి విగత జీవిగా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఆధారంగా తక్కువ సమయంలోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వెంకటేష్ గత కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.