Jaipur Express Train : జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు.

Jaipur Express Train : జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి

Jaipur Express Train

Jaipur Express : మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్  (Palghar Railway Station) సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్ (Jaipur-Mumbai Express) రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. వారిలో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ (RPF ASI), ముగ్గురు ప్రయాణీకులు ఉన్నారు. తెల్లవారు జామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (Jaipur Express Train)  జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలిసింది. అయితే, ఈ కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ చేతన్ సింగ్‌ (Chetan Singh) గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని చెబుతున్నారు.

Robbery In Kerala: కేరళ రాష్ట్రంలో సినీ‌ఫక్కీలో భారీ దోపిడీ.. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఏం చేశారంటే ..

పశ్చిమ రైల్వే ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. పాల్ఘర్ రైల్వే స్టేషన్ దాటిన తరువాత కదులుతున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడని పేర్కొంది. అతను జరిపిన కాల్పుల్లో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, మరో ముగ్గురు ప్రయాణికులు మరణించారని తెలిపింది. కాల్పుల అనంతరం దహిసర్ స్టేషన్ సమీపంలో నిందితుడు రైలు బయటకు దూకాడని, అయితే, స్థానిక పోలీసులు కానిస్టేబుల్‌తో సహా, అతని వద్ద ఉన్న ఆయుధాన్ని అదుపులోకి తీసుకోవటం జరిగిందని పశ్చిమ రైల్వే పేర్కొంది. ప్రస్తుతం రైలులోని ప్రయాణికుల వాగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు.

Uttar Pradesh: అయ్యయ్యో పొరబడిన మహిళ..! మతిస్థిమితం లేనివ్యక్తిని భర్త అనుకొని ఇంటికి తీసుకెళ్లింది.. అసలు విషయం తెలిసి..

అదృష్టంశాత్తూ నిందితుడు జరిపిన కాల్పుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడలేదు. అయితే, నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడు, కాల్పులకు ముందు ఏమైనా ఘర్షణ జరిగిందా? మతిస్థిమితం సరిగా లేక కాల్పులు జరిపాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే, రైలులోని బీ5 కోచ్‌లో ఈ కాల్పులు ఘటన జరిగింది. పాల్ఘర్ రైల్వే స్టేషన్ ముంబై నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ రైలు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జంక్షన్ నుంచి రాత్రి 2గంటలకు బయలుదేరి ఉదయం 6.55 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.