Uttar Pradesh: అయ్యయ్యో పొరబడిన మహిళ..! మతిస్థిమితం లేనివ్యక్తిని భర్త అనుకొని ఇంటికి తీసుకెళ్లింది.. అసలు విషయం తెలిసి..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో.. మతిస్థిమితం లేని వ్యక్తిని పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించి మహిళ ఇంటికి తీసుకెళ్లింది. ఆ తరువాత అసలు విషయం తెలిసి షాక్‌కు గురైంది.

Uttar Pradesh: అయ్యయ్యో పొరబడిన మహిళ..! మతిస్థిమితం లేనివ్యక్తిని భర్త అనుకొని ఇంటికి తీసుకెళ్లింది.. అసలు విషయం తెలిసి..

Uttar Pradesh

Ballia District: యూపీలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చూపించుకునేందుకు వచ్చిన మహిళకు పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్త కనిపించాడు. ఆస్పత్రి బయట బిచ్చగాడి వేషధారణలో కనిపించిన భర్తను చూసి మహిళ కన్నీరుమున్నీరైంది. ఇన్నాళ్లు ఎటు వెళ్లిపోయావ్ అని ప్రశ్నిస్తూ.. మరోపక్క ఏడ్వసాగింది. అయితే, భర్త మాత్రం భార్య ఏడుస్తున్నా పట్టించుకోలేదు. భర్తకు మతిస్థిమితం లేదని తెలుసుకొని ఆమె బోరున విలపించింది. అనంతరం కుమారులను పిలిపించుకొని మతిస్థిమితం లేని వ్యక్తిని ఆ మహిళ ఇంటికి తీసుకెళ్లింది. ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని ఆ వ్యక్తిని మహిళ క్షమాపణలు కోరింది.

Uttar Pradesh: పదేళ్ల తరువాత కనిపించిన భర్త.. బిచ్చగాడి అవతారంలోఉన్న అతని వద్దకెళ్లి ఆమె ఏం చేసిందంటే ..

బలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దేవ్‌కలి గ్రామానికి చెందిన మోతీచంద్ వర్మకు 21ఏళ్ల క్రితం జానకీ దేవితో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నాయి. అయితే, పెండ్లి జరిగిన కొన్నేళ్ల తరువాత మోతీచంద్ మానసిక పరిస్థితి బాగాలేక వైద్యకోసం బంధువులతో కలిసి నేపాల్ కు వెళ్లాడు. అక్కడ తప్పిపోయి ఇంటికి రాలేదు. అప్పటి నుంచి భర్తకోసం జానకిదేవి అన్నిచోట్ల వెతుకుతూనే ఉంది. గత శనివారం ఆమె బలియా జిల్లాలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి బయట ఓ వ్యక్తి పెద్దగా జుట్టు పెంచుకొని నేలపై కూర్చొని బిత్తర చూపులు చూస్తున్నాడు. ఆమెకు అనుమానం వచ్చి అతని దగ్గరకు వెళ్లి చూసింది. కొద్దిసేపు తీక్షణంగా అతనివైపు చూసి బోరున విలపించింది. పదేళ్ల క్రితం తప్పిపోయిన భర్త అనుకొని అతన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. చిన్నపిల్లాడిలా అతని తలను నిమురుతూ ఆమె కన్నీరు పెట్టుకుంది. ఆ తరువాత కుమారులకు ఫోన్ చేసి పిలిపించి మతిస్థిమితం లేని వ్యక్తిని తన వెంట ఇంటికి తీసుకెళ్లింది.

Uttar Pradesh: దివ్యాంగుడి మీద ఇద్దరు జవాన్ల జులుం.. నీళ్లు అడిగినందుకు కిరాతకంగా కొట్టారు

పెరిగిన గడ్డంతో ఉన్న వ్యక్తిని చూసి మోతీచంద్ అనుకొని జానకి సంబరపడిపోయింది. కుమారులకు మీ తండ్రి అంటూ పరిచయం చేసింది. అయితే మోతీ‌చంద్‌కు మానసికస్థితి సరిగాలేకపోవడంతో ఎలాంటి స్పందన కనిపించలేదు. ఇంటికి తీసుకొచ్చిన కొద్ది గంటలకు జానకీదేవికి అనుమానం వచ్చింది. నిజంగా ఇతను తనభర్తేనా అనే డౌట్ వచ్చింది. దీంతో అతని ఒంటిపై పుట్టుమచ్చలను పరిశీలించారు. ఆ తరువాత తాను పొరపాటు చేశానని, అతను తన భర్తకాదని గుర్తించి ఆ వ్యక్తిని జానకీదేవి క్షమాపణలు కోరింది. ఈ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.