ఎన్నికలకు సహకరిస్తాం : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

ఎన్నికలకు సహకరిస్తాం : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

Updated On : January 26, 2021 / 5:47 PM IST

we co-operate local bodies elections, ap govt employees federation : కోర్టు తీర్పును గౌరవించి స్ధానికసంస్ధల ఎన్నికలకు సహాకరిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ప్రకటించింది. అమరావతి లో మంగళవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం  తీసుకున్నట్లు సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామి రెడ్డి చెప్పారు.

తాము ముందు నుంచి ఎన్నికల సంఘంపై ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. తాము ఎన్నికలు వద్దని  చెప్పలేదన్నారు. ఇబ్బంది పడే ఉద్యోగులను బలవంత పెట్టోద్దని మాత్రమే మేము అడిగామని అన్నారు.  ఇప్పడు కూడా ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ..కొన్ని మినహాయింపులు ఇవ్వాలని సీఎస్ గారిని కలిసి కోరతామని ఆయన చెప్పారు.