Rains in Telangana
Rains in Telangana, AndhraPradesh: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న రెండు-మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.
పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలోనూ రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తచెప్పారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు.
Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన