YCP: అధికార పార్టీలో గ్రూప్‌వార్.. సాయిరెడ్డి రంగంలోకి దిగినా ప్రకాశం వైసీపీలో మార్పురాదా?

ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఎంపీ విజయసాయిరెడ్డికి అసలు విషయాలన్నీ అర్థమైనట్లు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంపై సమీక్ష చేసిన విజయసాయిరెడ్డి..

YCP: అధికార పార్టీలో గ్రూప్‌వార్.. సాయిరెడ్డి రంగంలోకి దిగినా ప్రకాశం వైసీపీలో మార్పురాదా?

why group war not ending in prakasam district YCP?

Updated On : September 14, 2023 / 12:39 PM IST

Prakasam YCP: ప్రకాశం వైసీపీలో ప్రశాంతతకు చోటు లేకుండా పోయింది. జిల్లాపై ఏకచక్రాధిపత్యం చలాయిస్తున్న పార్టీలో గ్రూపులు చికాకు పెడుతున్నాయి. ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఏదో గ్రూప్‌వార్ (group war) ఉందంటే సరే అని సర్దుకుపోవచ్చు.. జిల్లా మొత్తం ఇదే సీన్ కనిపిస్తుండటంతో హైకమాండ్ కూడా టెన్షన్ పడుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు (Ongole) తప్ప.. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్మలాటలు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీలో టాప్ లీడర్ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) ఎదుటే కార్యకర్తలు, నాయకులు ఢీ అంటే ఢీ అనేలా కొట్లాటకు సిద్ధపడ్డారంటే ప్రకాశంలో ఎంతటి అశాంతి ఉందో అర్థమవుతోంది. అధికార పార్టీలో గ్రూప్‌వార్ ఎందుకు? సాయిరెడ్డి రంగంలోకి దిగినా పరిస్థితిలో మార్పురాదా?

అధికార వైసీపీ స్ట్రాంగ్‌గా ఉన్న జిల్లాల్లో ప్రకాశం జిల్లాది అగ్రస్థానం. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవాయే నడిచింది. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒక్క కొండపిలో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీయే గెలిచింది. స్థానిక ఎన్నికల్లోనూ క్లీన్‌స్విప్ చేసింది. ఇలా జిల్లాపై పూర్తి పట్టుసాధించిన వైసీపీకి ఇప్పుడు గ్రూప్ వార్ తలనొప్పి తెప్పిస్తోంది. ఒంగోలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ పతాకస్థాయికి చేరింది. నేతల మధ్య విభేదాలతో పార్టీకి ఇబ్బంది వస్తుందని జిల్లా బాధ్యతలను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించింది వైసీపీ అధిష్టానం. సమన్వయకర్త బాధ్యతల్లో నేతల మధ్య విభేదాలను చక్కదిద్దేందుకు రెడీ అయిన విజయసాయిరెడ్డికే షాక్ ఇచ్చే రీతిలో నేతలు కుమ్ములాడుకోవడం హాట్‌టాపిక్ (Hot Topic) అవుతోంది.

గత రెండు రోజులుగా ప్రకాశం వైసీపీపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. విజయసాయిరెడ్డి. ఐతే ఏ నియోజకవర్గంలోనూ పార్టీ ఏకతాటిపై ఉన్నట్లు కనిపించడం లేదని గ్రహించారు విజయసాయిరెడ్డి. ఆరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయింది పార్టీ. ముఖ్యంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే అనుచరులపై సాయిరెడ్డికి ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీపీ ఒకరు.. ఆ సందర్భంగా తనను అడ్డుకున్న ఓ ద్వితీయశ్రేణి నాయకుడి చెంప చెల్లుమనిపించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read: వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా అవినీతి చేస్తున్నారు.. చంద్రబాబు దొరికిపోయారు

కొండపి, గిద్దలూరు, దర్శి, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లోనూ పార్టీలో తీవ్రస్థాయిలో విభేదాలు ఉండటంపై హైకమాండ్‌లో ఆందోళన కనిపిస్తోంది. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుండగా.. నేతలు అంతా ఒకరి నష్టం చేసేలా.. మరోకరు బహిరంగంగా రోడ్డెక్కడంపై సీరియస్‌గా పరిశీలిస్తోంది. విభేదాలకు ఆజ్యం పోస్తున్నవారికి చెక్ చెప్పేలా నిర్ణయాలు తీసుకోవాలని హైకమాండ్‌కు విజయసాయిరెడ్డి రిపోర్ట్ ఇవ్వనున్నారని చెబుతున్నారు పరిశీలకులు.

Also Read: చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి స్పందించిన బండి సంజయ్.. అప్పుడే అరెస్ట్ చేయాలా అంటూ ఫైర్

జిల్లాలో పరిస్థితులు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఎంపీ విజయసాయిరెడ్డికి అసలు విషయాలన్నీ అర్థమైనట్లు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంపై సమీక్ష చేసిన విజయసాయిరెడ్డి.. ఎవరితో ఎవరికి సమస్య ఉందో గుర్తించారని చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంపైనా.. అక్కడి ఎమ్మెల్యే, వ్యతిరేక వర్గంపైనా ఓ అంచనాకు వచ్చిన సాయిరెడ్డి.. జిల్లా పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత బాలినేని భుజస్కందాలపై ఉంచారని చెబుతున్నారు.

Also Read: చంద్రబాబు నాయుడు అరెస్టుపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలినేని రంగంలోకి దిగితేగాని శ్రేణులను కట్టడి చేయలేమని భావించిన ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకట్‌రెడ్డి, (Janke Venkata Reddy) మంత్రి ఆదిమూలం సురేశ్‌లను (Audimulapu Suresh) తప్పించి బాలినేనిపై పూర్తి భారం మోపటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న బాలినేని సహకారంతో అంతర్గత విభేదాలపై ప్రత్యేక ఆపరేషన్ చేస్తానని.. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెబుతున్నారు సాయిరెడ్డి.. కార్యకర్తలు కూడా గ్రూప్‌వార్‌కు ఎండ్‌కార్డ్ కోసమే ఎదురుచూస్తున్నారు. బాలినేని సహకరాంతో ఎంపీ విజయసాయిరెడ్డి ఎలాంటి చికిత్స చేస్తారనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.