Poonam Kaur: చంద్రబాబు నాయుడు అరెస్టుపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆమె తమ అభిప్రాయాన్ని తెలిపారు.

Poonam Kaur: చంద్రబాబు నాయుడు అరెస్టుపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu Arrest

Poonam Kaur  Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్టు తీరును టీడీపీ, జనసేన, సీపీఐ నేతలు, కార్యకర్తలతో‌పాటు పలు రంగాల ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాజకీయ పార్టీల నేతలు నుండి చంద్రబాబుకు సానుభూతి వ్యక్తమవుతుంది. చంద్రబాబు అరెస్టు విధానం సరికాదంటూ పశ్చిమ బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ, కుమారస్వామితో పాటు పలువురు జాతీయస్థాయి నేతలు స్పందించారు.

Sidharth Luthra: అవేమీ పట్టించుకోవద్దు..! సిద్ధార్థ్ లూథ్రా మరో సంచలన ట్వీట్.. ఈసారి ఏం చెప్పారంటే?

మరోవైపు సినీ పరిశ్రమ నుంచిసైతం చంద్రబాబుకు మద్దతు లభిస్తుంది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఇప్పటికే రాఘవేంద్ర రావు, అశ్వనీదత్, నారా రోహిత్‌తో‌పాటు అనేక మంది స్పందించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. నా ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు. చేసిన మంచి పనులు ప్రజాసేవే ఆయన్ను బయటకు తీసుకొస్తాయి అంటూ రజనీకాంత్ పేర్కొన్నారు.

Chandrababu Arrest : జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్న పవన్, బాలకృష్ణ, లోకేశ్.. రాజమండ్రి చేరుకున్న పవన్ .. live updates

చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆమె తమ అభిప్రాయాన్ని తెలిపారు. 73ఏళ్లు అంటే జైల్లో ఉండాల్సిన వయసు కాదు. ముఖ్యంగా, ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్లపాటు సేవలందించిన తరువాత ఇలా జైలులో ఉండటం బాధాకరం. ఇప్పుడు జరుగుతున్న విషయాలపై మాట్లాడడానికి నాకెలాంటి అధికారం కానీ, సంబంధం కానీ లేదు. అయితే, మానవత్వంతో మాత్రమే స్పందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు సార్ ఆరోగ్యం, వయస్సును పరిగణలోకి తీసుకోవాలని మానవతా ధృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను అని పూనమ్ కౌర్ ట్వీట్ లో పేర్కొన్నారు.