Gorantla Madhav : చంద్రబాబు జైలుకెళితే మీరెందుకు చనిపోలేదు?- టీడీపీ నేతలను ప్రశ్నించిన వైసీపీ ఎంపీ

చంద్రబాబు అనేక మందిని ముంచి ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. Gorantla Madhav - Chandrababu Arrest

Gorantla Madhav - Chandrababu Arrest

Gorantla Madhav – Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో దుమారం కంటిన్యూ అవుతోంది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. చంద్రబాబు ప్రజాధనం దోచుకున్నారని, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారని, ఇందులో రాజకీయ కక్షసాధింపు ఏమీ లేదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. ” చంద్రబాబు అనేక మందిని ముంచి ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. న్యాయవ్యవస్థ మీద నీతి బాహ్యంగా మాట్లాడుతున్నారు. ఒక ట్రైల్ జరిపినట్టు వాదనలు చేసినా బెయిల్ రాలేదు.

Also Read..Roja Selvamani : మోదీ, అమిత్ షాలతో మాట్లాడి చంద్రబాబును విడిపించొచ్చు కదా- పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా సలహా

చంద్రబాబుపై ఉన్న అన్ని కేసులు ఒకేసారి ట్రైల్ జరగాలి. ఆయన చంద్రబాబు జీవితాంతం జైల్లో ఉండటం ఖాయం. ఆరోజు బకాసురుడు చనిపోతే దేవతలు సంబరాలు చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు జైలుకెళితే ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు జైలుకెళితే జనం చనిపోతున్నారని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. మరి టీడీపీ నేతలు ఎందుకు చనిపోలేదు? ”అని గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు.

Also Read..TDP Janasena Alliance: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. తర్వాత ఏం జరగబోతోంది?