Roja Selvamani : మోదీ, అమిత్ షాలతో మాట్లాడి చంద్రబాబును విడిపించొచ్చు కదా- పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా సలహా

జైల్లో ఉన్న ఖైదీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక దొంగ కోసం పోరాటం చేస్తున్నాడు. పుష్కరాల్లో ప్రజలు చనిపోయినప్పుడు.. Roja

Roja Selvamani : మోదీ, అమిత్ షాలతో మాట్లాడి చంద్రబాబును విడిపించొచ్చు కదా- పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా సలహా

Roja - Pawan Kalyan

Roja – Pawan Kalyan : టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. జగన్ ప్రభుత్వంపై ఇక యుద్ధమే అంటూ జనసేనాని అనడం కాక రేపాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి అంటూ పొత్తులపై క్లారిటీ ఇచ్చేసిన పవన్ పై వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పొత్తులపై పవన్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పక్కోడి కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ అని విమర్శించారు. జైల్లో ఉన్న ఖైదీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక దొంగ కోసం పోరాటం చేస్తున్నాడు అని పవన్ పై ధ్వజమెత్తారు మంత్రి రోజా. పుష్కరాల్లో ప్రజలు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు? ముద్రగడ పద్మనాభంకు ఎందుకు అండగా నిలబడలేదు? అని పవన్ ను నిలదీశారు. ప్యాకేజీ కోసమే పవన్ ఇదంతా చేస్తున్నాడు. సిగ్గు లేకుండా బానిస బతుకు బతుకుతున్నాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.(Roja)

Also Read..TDP Janasena Alliance: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. తర్వాత ఏం జరగబోతోంది?

”జన సైనికులు కాదు జెండాలు మోసే కూలీలు. సపోర్ట్ చేసే వారందరికీ స్కిల్ స్కాంలో వాటాలున్నాయి. చంద్రబాబు సంతకాలు లేవని అవగాహన లేకుండా అంటున్నారు. సీఐడీ చెప్పిన విషయాలు పవన్ కు తెలియడం లేదా? అమిత్ షా, మోదీలతో మాట్లాడి చంద్రబాబును విడిపించవచ్చు కదా. ఇందులో కక్ష సాధింపు లేదు. సినిమాలో మాత్రమే పవన్ హీరో. రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్. సినీ పరిశ్రమలో నువ్వు ఉండడం సిగ్గు చేటు. కళాకారులుగా మాకు అవమానం. పందులు గుంపులుగా వస్తాయని ఇవాళే పవన్ కళ్యాణ్ అంగీకరించాడు” అని ఫైర్ అయ్యారు మంత్రి రోజా.

”చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులు ఎలా వచ్చాయి? అని ఐటీశాఖ నోటీసులు ఇచ్చిన విషయం నీకు తెలియదా? బీజేపీతో పొత్తులో ఉన్నాను అంటావే. మరి, అదే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈడీ కేసులు పెట్టింది. ఈడీ అటాచ్ మెంట్లు తీసుకుని ఐటీ నోటీసులు ఇస్తే.. బీజేపీ పొత్తులో ఉన్న నువ్వు అటు మోదీనో, ఇటు అమిత్ షాతోనో మాట్లాడి చంద్రబాబు నాయుడు పతితుడు, ఎలాంటి తప్పు చేయలేదు, స్కిల్ స్కామ్ జరిగింది కానీ ఆయన చేయలేదు అని చెప్పి విడిపించొచ్చు కదా? అది వదిలేసి జగన్ అక్రమ కేసులు పెట్టారు. జగన్ అక్రమంగా చంద్రబాబుని లోపల పెట్టారు.(Roja)

ఇందులో జగనన్నకు ఏం సంబంధం? తప్పు చేసింది చంద్రబాబు. ప్రజల డబ్బు దోచుకుంది చంద్రబాబు. దాని ఈడీ, ఐటీ, కేంద్రం నోటీసులు ఇచ్చాయి. సాక్ష్యాధారాలతో దొరికారు కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది. అంతేకానీ ఇందులో కక్షసాధింపు చర్య ఎక్కడుంది? మాట్లాడే ముందు ఒకసారి పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి. పవన్ కూడా అరెస్ట్ అవుతాడని భయపడుతున్నాడేమో. అందుకే ఇలా మాట్లాడుతున్నాడేమో?” అని మంత్రి రోజా అన్నారు.

Also Read..Pawan Kalyan: జైల్లో చంద్రబాబు భద్రత విషయంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

”ప్రభుత్వాన్ని, కేబినెట్ లో ఉన్న మంత్రులను కూడా మోసం చేసి చంద్రబాబు సెపరేట్ గా ఏ విధంగా డబ్బులో దోచుకున్నాడో పార్టీలో అందరికీ తెలుసు. అందుకే వాళ్లు ఎవరూ మాట్లాడటం లేదు. అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు 13 సంతకాలు చేస్తే.. అచ్చెన్నాయుడు 5 సంతకాలు పెట్టాడు. ఆయన ప్యాకేజీ ఆయన తీసుకున్నాడు కాబట్టే ఈరోజు దాని నుంచి బయటపడేందుకు వాగుతున్నాడు తప్ప మరొకటి కాదు. టీడీపీలో ఎందరో మహామహులు ఉన్నారు. వారంతా ఎందుకు మాట్లాడటం లేదో పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి” అని మంత్రి రోజా అన్నారు.