Ys Jagan: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మరోసారి తన రాజకీయ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇష్టం వచ్చిన బుక్ లో పేరు రాసుకోండి అన్న జగన్.. మనం వచ్చాక వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. అన్యాయం చేసిన వాళ్లకు మాత్రమే కాదు.. కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్లను కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి శిక్షిస్తామన్నారు. జగన్ 2.Oలో సంకేమం, అభివృద్ధి కంటే కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ ఇస్తానని జగన్ చెప్పారు.
”టీడీపీ ఆఫీస్ ఘటన విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. టీడీపీ హయాంలో చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుని ప్రజలు ఈ పక్క తంతే ఆ పక్క పడతాడు.
ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే.. మాజీ మంత్రి కాకాణిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మన పార్టీ వాళ్లు కాదని మన ఎమ్మెల్యేలు వద్దు అన్నా వాళ్లకి మంచి చేయమని చెప్పిన వ్యక్తి జగన్. ఈసారి పాఠాలు నేర్పించారు.. రేపు ఎలా ఉంటాదో మేము చెబుతాం” అని కార్యకర్తలతో హాట్ కామెంట్స్ చేశారు జగన్.
Also Read: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నిక..
”TDP అంటే తెలుగు డ్రామా పార్టీ. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. సత్తా అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. కడపలో మహానాడు పెట్టి.. జగన్ ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది..?” అని ప్రశ్నించారు జగన్.