Yarram Venkateswara Reddy (Pic credit: @_YSRCP_Palnadu_)
Yarram Venkateswara Reddy: ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంకటేశ్వర రెడ్డితో పాటు ఆ పార్టీలో ఆయన కుమారుడు నితిన్ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ పక్కాల సూరిబాబు కూడా చేరారు.
సత్తెనపల్లి నుంచి యర్రం వెంకటేశ్వర రెడ్డి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కాగా, ఆయన వైసీపీలో చేరుతున్న సమయంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్ గాదె సుజాత కూడా అక్కడే ఉన్నారు.
యర్రం వెంకటేశ్వర రెడ్డి గతంలో జనసేన పార్టీలోనూ కొనసాగారు. యర్రం వెంకటేశ్వర రెడ్డి ఎలాంటి మచ్చలేని వ్యక్తి అని ఈ సందర్భంగా అంబటి రాంబాబు, లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఆయన పార్టీలో చేరడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని చెప్పారు. ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని అన్నారు.
Arun Bothra IPS : ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా అలా మోసపోయారేంటి?