Arun Bothra IPS : ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా అలా మోసపోయారేంటి?

సామాన్యులు మోసగాళ్ల చేతిలో మోసపోయారంటే సరే.. ఇక పోలీస్ అధికారిని కూడా బురిడీ కొట్టించేస్ధాయిలో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఓ రెస్టారెంట్‌లో తనకి జరిగిన మోసం ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

Arun Bothra IPS : ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా అలా మోసపోయారేంటి?

Arun Bothra IPS

Arun Bothra IPS : రెస్టారెంట్‌కి వెళ్లినపుడు డబ్బులు పోగొట్టుకోవడం.. వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఓ రెస్టారెంట్‌కి వచ్చిన వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించాడు. ఆయన పేరు చెప్పి దోశలు తిన్నాడు. బిల్లు చూసేవరకు తను మోసపోయానని ఆ అధికారికి అర్ధం కాలేదు. ఇంతకీ ఎవరా ఆఫీసర్?

kind heart : బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి చలించి పోయిన ఐపీఎస్ ఆఫీసర్.. ఏం చేశారంటే?

ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా భోజనం చేయడానికి రెస్టారెంట్‌కి వెళ్లారు. భోజనం అయ్యాక వెయిటర్ బిల్లు తెచ్చి ఇచ్చాడు. ఆ బిల్లులో అదనంగా 2 దోశలు ఆర్డర్ ఉన్నట్లు ఆఫీసర్ గమనించారు. ఆశ్చర్యపోయిన ఆయన బిల్లులో దోశలు ఎలా వచ్చాయని వెయిటర్‌ని ప్రశ్నించారు.

 

వేరే టేబుల్‌పై కూర్చున్న వ్యక్తి ఆఫీసర్‌గారితో వచ్చానని దోశలు ఆర్డర్ చేసి తిన్నట్లు వెయిటర్ వివరించాడు. సరిగ్గా బిల్లు ఇచ్చే టైంకి ఆ వ్యక్తి పలాయనం చిత్తగించాడు. వెయిటర్ ఆన్సర్ విని అరుణ్ బోత్రా ఆశ్చర్యపోయారు. తినని ఫుడ్‌కి బిల్లు చెల్లించి బయటపడ్డారు.

IPS Officer: కెరీర్‌లోనే నాలుగోసారి రాజీనామా చేసిన ఐపీఎస్ ఆఫీసర్

ఈ ఘటనను వివరిస్తూ అరుణ్ బోత్రా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ఇలాంటి మోసాలు జరుగుతాయని ఈ ఘటన చూస్తుంటే అర్ధం అవుతోంది. ఒక పోలీస్ అధికారినే బురిడీ కొట్టించాడంటే సామాన్యులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో?

 

ఇక ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “వేరే వ్యక్తి ఆర్డర్ ఇస్తున్నప్పుడు వెయిటర్ ఆఫీసర్ దగ్గర ఎందుకు కన్ఫర్మేషన్ తీసుకోలేదని” కొందరు.. “దోశ మాత్రమే కదా తిన్నాడు వదిలిపెట్టండి” అని మరికొందరు అభిప్రాయపడ్డారు. బోత్రా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు మంచి పోస్టులు పెడుతు అందరికీ టచ్‌లో ఉంటారు.