Ycp Complaint : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత నాగబాబుపై సీఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. మంత్రుల తలలు తగిలించి వైఎస్ జగన్ ను రాక్షసుడిగా చిత్రీకరిస్తూ బ్రష్టాచార్ అంటూ ఆర్ట్ గీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ సీఈవోకు ఫిర్యాదు చేశారు ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతం రెడ్డి, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి.
గౌతం రెడ్డి- ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్
”ఎంసిసి రూల్స్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, నాగబాబు వ్యవహరిస్తున్నారు. ప్యూపుల్స్ రెప్రజెంటివ్ యాక్ట్, ఐపిసి ప్రకారం వీరిపై చర్యలు తీసుకుంటాం. సీఎం జగన్ ను పది తలల రాక్షసుడిగా చిత్రీకరిస్తూ చేస్తున్న ప్రచారంపై సిఇవోకు ఫిర్యాదు చేశాం. సీఎం జగన్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సిఇఓకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాము”.
నారాయణ మూర్తి- నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్
”మంచి చేస్తున్న వైఎస్ జగన్ ను వ్యక్తిగతంగా చెడుగా ప్రజల్లో ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, నాగబాబు ఇష్టానుసారంగా వైఎస్ జగన్ ను మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ ను టెర్రరిస్ట్ అంటూ చంద్రబాబు దూషిస్తున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఎంసీసీ రూల్స్ తెలియదా? అనకాపల్లిలో ఇల్లు తీసుకొని, నరసాపురంలో పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయిన నాగబాబుకు విజ్ఞత లేదు. జగన్ ను విమర్శించే అర్హత లేదు”.
Also Read : టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు.. 11 నియోజకవర్గాల అభ్యర్థులు వీరే?