Anagani Satyaprasad : వీఆర్ఏ, వీఆర్వోలను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం : ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

8 ఏళ్ల నుంచి వీర్వోలుగా పనిచేస్తున్న వారిని గ్రేడ్ 1 పోస్టులో నియమించకుండా ప్రత్యేకంగా గ్రేడ్ 2 పోస్టు పేరుతో కేవలం రూ. 15 వేలు వేతనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు.

Anagani Satyaprasad

MLA Anagani Satyaprasad : వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పని భారం పెంచి, పలు నిబంధనలు విధించి వీఆర్ఏ, వీఆర్వోలను వేధింపులకు గురిచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. తమకు సంబంధం లేని విధులు కేటాయించి రాత్రింభవళ్లు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వీఆర్వోలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. 8 ఏళ్ల నుంచి వీర్వోలుగా పనిచేస్తున్న వారిని గ్రేడ్ 1 పోస్టులో నియమించకుండా ప్రత్యేకంగా గ్రేడ్ 2 పోస్టు పేరుతో కేవలం రూ. 15 వేలు వేతనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు.

Botsa Satyanarayana : పవన్ కళ్యాణ్ కు ట్యూషన్ చెబుతా : మంత్రి బొత్స

నిత్యం ప్రజలకు అందుబాటులో సేవలందిస్తున్న వీఆర్ఏ, వీఆర్వోలను వేధించటం మానుకోవాలని హితవు పలికారు. అప్ గ్రేడ్ చేసిన పోస్టుల స్థానంలో అర్హులైన వీఆర్వోలను ఎంఆర్ఐలుగా నియమించాలని డిమాండ్ చేశారు.