Nagari : రోజాకు చక్రపాణిరెడ్డి సవాల్..ఇండిపెండెంట్‌గా నిలబడుతా

నగరి ఎమ్మెల్యే రోజాకు సవాల్‌ విసిరారు ఆమె ప్రత్యర్థివర్గం నేత చక్రపాణిరెడ్డి. రోజాపై తాను ఇండిపెండెంట్‌గా నిలబడతానని ఆమె కూడా తనపై ఇండిపెండెంట్‌గా నిలబడాలన్నారు.

Roja

YCP Leader Chakrapani Reddy : నగరి ఎమ్మెల్యే రోజాకు సవాల్‌ విసిరారు ఆమె ప్రత్యర్థివర్గం నేత చక్రపాణిరెడ్డి. రోజాపై తాను ఇండిపెండెంట్‌గా నిలబడతానని ఆమె కూడా తనపై ఇండిపెండెంట్‌గా నిలబడాలన్నారు. తనపై రోజా గెలిస్తే.. ఆమె ఇంట్లో వాచ్‌మెన్‌గా చేయడానికి తాను సిద్ధమన్నారు. రోజాను రెండు సార్లు తామే గెలిపించామన్నారు. కష్టపడి గెలిపించినందుకు తమకు బాగానే బుద్ది చెబుతోందని ఫైర్‌ అయ్యారు.

Read More : Cyclone : గులాబ్ గుబుల్, తుపాన్ ముప్పు..సాయంత్రం తీరం దాటే అవకాశం

నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వైసీపీలోని రెండు వర్గాల ఆందోళనతో ఎంపీపీ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌తో పాటు ఎన్నికల సంఘానికి పంపుతామని చెప్పారు. నగరి ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో ఎంపీపీ ఎన్నికపై రెండ్రోజులుగా రగడ కొనసాగుతోంది.

Read More : ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌‌కు ప్రధాని మోదీ వార్నింగ్

నిండ్ర మండల ఎంపీపీ పదవి కోసం వైసీపీలోని రెండు వర్గాలు పట్టుబట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీటీసీ దీపను రోజా బలపర్చగా… భాస్కర్‌రెడ్డిని ఎంపీపీ చేయాలని రోజా ప్రత్యర్థి వర్గం డిమాండ్‌ చేసింది. ఇరు వర్గాలు తోపులాటకు దిగడంతో ఎంపీపీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎంపీపీ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.