ఏపీలో ఈవీఎంల గోల్‌మాల్‌ జరిగింది.. సంచలన వీడియో విడుదల చేసిన కేతిరెడ్డి

ఏమాత్రం అవగాహనలేని అశ్వినీదత్, కేకే, ప్రశాంత్ కిషోర్ కూటమికి 160 సీట్లు వస్తాయని ముందుగానే ఎలా చెప్పగలిగారని కేతిరెడ్డి ప్రశ్నించారు.

Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy : ఏపీతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల గోల్‌మాల్‌ జరిగిందని వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 362 నియోజకవర్గాల్లో ఐదు లక్షల 54వేల ఓట్లు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కేతిరెడ్డి వీడియోను విడుదల చేశారు.

Also Read : కక్షపూరితంగా డిస్మిస్ చేశారు: వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

ఏపీలో ఈవీఎంల గోల్‌మాల్‌ కచ్చితంగా జరిగిందని కేతిరెడ్డి అన్నారు. ఏమాత్రం అవగాహనలేని అశ్వినీదత్, కేకే, ప్రశాంత్ కిషోర్ 160 సీట్లు వస్తాయని ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. ఏపీ, తమిళనాడుతో సహా దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో ఈవీఎంలను మార్చేశారని ఆరోపించారు. పోలైన ఓట్లకు ఈవీఎంలలో ఓట్లకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు.

Also Read : Tamilsai : అమిత్ షా సీరియస్ వార్నింగ్‌.. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చిన తమిళిసై సౌందరరాజన్

కౌంటింగ్ ప్రారంభమైన గంటలోపే 150 సీట్లు కూటమికి వచ్చాయని ఎలా చెప్పగలిగారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. ఏజెంట్లు బయటకు వెళ్లాలని ఇలాంటి దుష్ర్పచారం చేశారని ఆరోపించారు. ఏజెంట్లు బయటకు రాగానే అధికారులు ఇష్టం వచ్చినట్లు మెజార్టీలు రాసుకున్నారని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓట్ల తారుమారుపై లెక్కలతో సహా కేతిరెడ్డి వీడియోలో వివరించారు.