ఎమ్మెల్యే దొరబాబుతో వైసీపీ నేతల కీలక చర్చలు.. ఏం జరుగుతోంది?

పిఠాపురంలో క్యాడర్ సహకరించడం లేదని వైసీపీ పెద్దలకు వంగా గీత ఫిర్యాదు చేశారు.

YCP Leaders Convincing MLA Pendem Dorababu

Pendem Dorababu : పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంవో నుంచి పిలుపు అందింది. దీంతో వెంటనే సీఎంవోకు బయలుదేరి వెళ్లారు. నిన్న జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదు. మరోవైపు పిఠాపురంలో క్యాడర్ సహకరించడం లేదని వైసీపీ పెద్దలకు వంగా గీత ఫిర్యాదు చేశారు. సీఎంవోకు చేరుకున్న దొరబాబుతో వైసీపీ పెద్దలు చర్చిస్తున్నారు.

పిఠాపురం వైసీపీలో రాజకీయం ఆసక్తిరంగా మరాయి. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. అయితే, ఆయనను ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు సీఎం జగన్. ప్రస్తుతం ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించారు జగన్. అప్పటి నుంచి కూడా పెండెం దొరబాబు పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారు. ఇక, నిన్న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించి ఎమ్మెల్యే దొరబాబుకు ఆహ్వానం కూడా రాలేదు. దీంతో ఆయన మరింత హర్ట్ అయ్యారని, అలకబూనారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నట్లు వైసీపీ అధిష్టానానికి సూచనప్రాయంగా తెలిసింది.

Also Read : చంద్రబాబుతో వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు భేటీ.. టీడీపీ నాయకుల్లో టెన్షన్

దీంలో అలర్ట్ అయిన వైసీపీ అధినాయకత్వం.. వెంటనే సీఎంవోకు రావాలని పెండెం దొరబాబును పిలిచింది. దీంతో పెండెం దొరబాబు కాకినాడ నుంచి సీఎంవో వెళ్లారు. పెండెం దొరబాబుతో పార్టీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు.

పిఠాపురంలో క్యాడర్ తనకు సహకరించడం లేదని, అలాగే పార్టీ క్యాడర్ తనకు సహకరించకుండా ఉండాలని ఎమ్మెల్యే దొరబాబు పిఠాపురం నేతలకు సూచించారని.. వంగా గీత.. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో పెండెం దొరబాబును సీఎంవోకు పిలిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తనను ఆహ్వానించకపోవడం పట్ల ఎమ్మెల్యే దొరబాబు కొంత ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. కార్యకర్తల దగ్గర ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

ఇంతటి అవమానం జరుగుతున్న పార్టీలో తాను ఎందుకు కొనసాగాలి? అని నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్యే దొరబాబు అన్నట్లు సమాచారం. దీనిపై ఆయన తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎంవో నుంచి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ పెద్దలు ఎమ్మెల్యే దొరబాబుతో ఏం మాట్లాడుతున్నారు? అనేది తెలియాల్సి ఉంది.

Also Read : సీఎం జగన్ ఊహించని ట్విస్టులు.. ఎమ్మెల్యేలలో జాబితా గుబులు