Dharmana Prasada Rao : రైతులు బతకరు.. NREGS పథకంపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఈ విధంగా పథకాల రూపకల్పన దేశ నాశనానికి దారి తీస్తాయని హెచ్చరించారు. రెండు గంటల పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి ఎందుకు వస్తారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

Dharmana Prasada Rao : వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు NREGS(మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ) పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి కూలీలు వెళ్లకూడదు అనేట్లు NREGS పథకాన్ని అమలు చేస్తే రైతులు బతకరని ఎమ్మెల్యే ధర్మాన అన్నారు. ఈ విధంగా పథకాల రూపకల్పన దేశ నాశనానికి దారి తీస్తాయని హెచ్చరించారు. రెండు గంటల పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి ఎందుకు వస్తారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

గెడ్డ మెడుతున్నట్లు యాక్షన్ చేయడానికి కూలీలు NREGS పనులకే వెళ్లిపోతారని అన్నారు. ఇలాంటి పోరంబోకులను తయారు చేసే పద్దతి వ్యవసాయానికి దెబ్బ అని చెప్పారు. రైతులకు ఏమైనా ఫర్వాలేదనే పద్దతి కొనసాగించాలని ప్రభుత్వం అనుకుంటే అలాగే వదిలేయండి అని ఎమ్మెల్యే అన్నారు. వాస్తవానికి పంట పండించే రైతులకు జీతాలు ఇవ్వాలన్నారు. ఇది కేంద్ర చట్టం అని, దీన్ని పార్లమెంట్ చేసి వెంటనే మార్చాలన్నారు. వ్యవసాయం కోసం పని చేసే కూలీలకు పని దొరకనప్పుడు NREGS కింద పని ఇవ్వడంలో తప్పులేదన్నారు ఎమ్మెల్యే ధర్మాన.

Farts Selling: పిత్తులు అమ్మే టీవీ స్టార్‌కు గుండెనొప్పి

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ధర్మాన కామెంట్స్..
ప్రజల కోసం సంక్షేమ పథకాల కింద డబ్బులు పంచుతున్నాము కాబట్టే ఆ పనులు ఆలస్యం అవుతున్నాయని ఎమ్మెల్యే ధర్మాన అన్నారు. సంక్షేమం బాగా చేస్తుండబట్టే అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. రెండూ చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. పెన్షన్ పెంచామని అంటే.. మరి నూనె ధరలు పెరగలేదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ధరలు ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే కాదు దేశం అంతటా పెరిగాయి అని ఎమ్మెల్యే ధర్మాన గుర్తు చేశారు. తెలంగాణ, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో కూడా ధరలు పెరిగాయని చెప్పారు. అక్కడి ప్రభుత్వాలు పెన్షన్ ఎంత ఇస్తున్నాయి? మన ప్రభుత్వం ఎంత ఇస్తోంది? అనేది బేరీజు చేసుకోవాలన్నారు.

Cold : జలుబుతో బాధపడుతున్నారా!…ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?

వ్యవసాయం.. వరి పై ధర్మాన కామెంట్స్..
”వ్యవసాయం చేసే వారి బతుకులు ఎక్కడా బాగోలేదు. దేశంలోనే వ్యవసాయం కష్టకాలంలో ఉంది. ఒకప్పుడు వ్యవసాయదారులు సంతోషంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎంతో కష్టపడి వరి పండిస్తే కొనేవాడు లేడు. ఒకవేళ అమ్మినా సజావుగా డబ్బులు ఇచ్చేవాడు లేడు. ఎవరైనా డబ్బులు ఇచ్చినా అవి పెట్టుబడికి కూడా సరిపోక రైతుకు నష్టమే మిగులుతుంది. ఈ దేశంలో వరి మన అవసరాలకు మించి పండిస్తున్నాం. కేంద్రం 80 కేజీల ధాన్యానికి రూ.1582 రేటు నిర్ణయించింది. అది సరిపోదు.. కనీసం రూ.3 వేల పైన ఉండాలనేది నా భావన. దేశంలో ఏ ఒక్క వ్యవసాయదారుడు సంతోషంగా లేడు. ఎవరింట్లో చూసినా విషాదమే కనిపిస్తుంది. రాష్ట్రంలో రోడ్లు, ప్రాజెక్టులు వంటి అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే” అని ఎమ్మెల్యే ధర్మాన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు