బీజేపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి

మా కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారని ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతిలో ఆయన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మిథున్ రెడ్డి ఇవాళ పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ను అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత వైసీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు.. ఇళ్లులు కూల్చుతున్నారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి ఇవాళ పుంగనూరులో ఉందని అన్నారు.

Also Read : Deputy CM Pawan kalyan : పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

మా కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారు. ఎంపీగా నాకు ఉన్న అర్హతను అడ్డుకుంటున్నారు. పోలీసులు నన్ను వెళ్ళద్దు అంటున్నారు. దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని మిథున్ రెడ్డి అన్నారు. 40శాతం మంది వైసీపీకి ఓటు వేశారు. వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా.? అధికారం శాశ్వతం కాదు. ప్రతీ కార్యకర్తకు మేము అండగా ఉంటామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. మీరు వెళ్ళడానికి లేదు.. హౌస్ అరెస్టు చేస్తున్నాము అని నాకు నోటీస్ ఇచ్చారు. పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడవద్దని టీడీపీ నేత చల్లా బాబుకు మిథున్ రెడ్డి సూచించారు.

Also Read : Nigeria : నైజీరియాలో దారుణం.. వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన గ్వోజా పట్టణం.. 18మందికిపైగా మృతి

మంత్రి పదవిని కాపాడుకునేందుకే మంత్రి రాంప్రసాద్రెడ్డి మాపై విమర్శలు చేస్తున్నారంటూ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని కొద్దిరోజుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. కొందరు పనిగట్టుకొని నాపై విషప్రచారం చేస్తున్నారు. బుద్ధిలేని వ్యక్తులే మేము బీజేపీలోకి వెళుతున్నాం అంటూ ప్రచారం చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు