YS Avinash Reddy: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌లో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైఎస్ షర్మిల, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతపై మండిపడ్డారు. షర్మిల తాజాగా చేసిన కామెంట్లకు అవినాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణా జ్ఞానం ఉండాలని అవినాశ్ రెడ్డి అన్నారు. తమ గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండని చెప్పారు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. విజ్ఞత కలిగిన వారెవ్వరూ అలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. అలాంటి మాటలు వినడానికి కూడా బాగోవని చెప్పారు.
కాగా, శుక్రవారం బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ సునీతతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అవినాశ్ రెడ్డిపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కడపలో వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నారు.
Also Read: దీక్షకు దిగిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నారని కామెంట్స్