దీక్షకు దిగిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నారని కామెంట్స్
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగారని, రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచులు..

KTR Deeksha: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్‌లో రైతు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు పోయిన నాలుగు నెలల్లోనే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని అనుకోలేదని తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతుతో సమానమంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేపటి నుంచి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్ పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్నికల వేల ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగారని, రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నారని చెప్పారు. నేతన్నల కొరకు మేము పోరాటం చేస్తామని అన్నారు. ఓ వైపు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి, మరోవైపు తాపీ మేస్త్రి మోదీ ఉన్నారని చెప్పారు.
రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని అంటున్నారని చెప్పారు. కరవు వస్తే కాంగ్రెస్ నేతలను ఎందుకు తిడుతున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారని తెలిపారు. 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయిందని, ఇది కాలం తెచ్చిన కరవు కాదని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరవని అన్నారు. మేడిగడ్డ నుంచి రోజు రెండువందల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని తెలిపారు.