YS Jagan Mohan Reddy
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కీలక కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఏపీలో ఓట్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు.. అంటూ ప్రశ్నించారు.
జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని, ప్రజాస్వామ్యం లేదని అనడానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు. ఆ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకం రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగలేదు. వైసీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగ్ చేశారు. పోలీసులు దగ్గరుండి ఏజెంట్లను బూత్ లోపలికి పంపలేదు. ఏజెంట్ బూత్ లోపలకి రానివ్వకుండా దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసేశారు.. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిన పరిస్థితి దేశంలో ఎక్కడ చూడలేదంటూ జగన్ అన్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ గురించి కీలక కామెంట్స్ చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ డమ్మీ పాత్ర వహిస్తుంది. న్యాయపోరాటం చేస్తాం.. కోర్టులో కేసు వేస్తామని జగన్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నిలక్లో 12.5శాతం అంటే 48లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి.. ఆధారాలన్నీ ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చాం.. కోర్టులను ఆశ్రయించాం. అయితే, రాహుల్ గాంధీ ఏపీలో జరిగిన ఓట్ల అవకతవకల గురించి ఎందుకు మాట్లాడలేదని జగన్ ప్రశ్నించారు. 48లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అవి రాహుల్ గాంధీకి తెలియదా..?
ఈ విషయాన్ని రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదు అంటూ జగన్ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడుతో ఫోన్లో రెగ్యూలర్‌గా టచ్‌లోనే ఉంటారు. చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు..? అమరావతిలో ఎన్నో స్కామ్ లు జరుగుతున్నాయి.. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం.. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు..? నన్ను విమర్శిస్తారు తప్ప చంద్రబాబు తప్పులను ఎందుకు విమర్శించడం లేదు అంటూ జగన్ ప్రశ్నించారు.